Breaking News

సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్‌

Published on Tue, 01/07/2025 - 18:24

సాక్షి,హైదరాబాద్: ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ కేసు(Formula E Car Race Case)లో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు(Supreme Court)లో ఆయన సవాల్‌ చేశారు.

ఫార్ములా ఈ కార్‌ రేసు కేసులో ఏసీబీ కేసును కొట్టేయాలని కేటీఆర్‌ వేసిన క్వాష్‌ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఏసీబీ దర్యాప్తులో మేం జోక్యం చేసుకోం అని తీర్పు సందర్భంగా పేర్కొంది. అయితే ఆ సమయంలో అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించాలని కేటీఆర్‌ తరఫు న్యాయవాది కోరగా.. ఆ విజ్ఞప్తిని ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదు.

ఈ కేసులో తాజా పరిణామాలపై ఏసీబీ ఆఫీసులో అధికారులు భేటీ అయ్యారు. ఎఫ్‌ఈవో, హెచ్‌డీఏతో పాటు రెవెన్యూ అధికారుల పాత్రపై చర్చించడంతో పాటు సుప్రీం కోర్టును కేటీఆర్‌ ఆశ్రయించడంతో.. అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించారు.

మరో వైపు.. అధికారులు అరవింద్‌కుమార్‌, బీఎల్‌ఎన్‌రెడ్డి నోటీసులపై చర్చతో పాటు, మొదటి రేసు తర్వాత తప్పుకున్న కంపెనీలపై  కూడా చర్చించారు. ఏసీబీ ఉన్నతాధికారులతో​ బంజారాహిల్స్‌ ఏసీపీ,సీఐతో పాటు కొంతమంది సిబ్బంది సమావేశమయ్యారు. క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో సుప్రీంకోర్టును కేటీఆర్‌ ఆశ్రయించారు. కాగా, తమ వాదన కూడా వినాలని ప్రభుత్వం.. కేవీయట్‌ వేసింది.

ఇదీ చదవండి: కేటీఆర్‌దే బాధ్యత.. ఎఫ్ఐఆర్‌ క్వాష్‌ అరుదైన నిర్ణయం: హైకోర్టు


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)