Breaking News

సాగర్‌ కుడివైపున సీసీ కెమెరాలకు ఓకే

Published on Wed, 10/22/2025 - 04:07

సాక్షి, హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ జలాశయానికి కుడి వైపున ఏపీ భూభాగం పరిధిలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) అనుమతిచి్చంది. ఇందుకోసం ఇంజనీర్లు, సిబ్బందిని డిసెంబర్‌ 31 వరకు ఏపీ వైపు ఉన్న డ్యామ్‌పైకి అనుమతించాలని సీఆర్పీఎఫ్‌ కమాండింగ్‌ అధికారికి మంగళవారం లేఖ రాసింది. రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం నిర్వహణ ఏపీ పరిధిలోకి వెళ్లగా నాగార్జునసాగర్‌ తెలంగాణ నిర్వహణ కిందకు వచ్చింది. 

గతంలో ఏపీ పోలీసులు సాగర్‌ డ్యామ్‌ కుడిభాగంలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసినట్లు తెలంగాణ ఆరోపించింది. ఆ ఘటన తర్వాత ఇరురాష్ట్రాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలను చల్లార్చడానికి కేంద్రం సాగర్‌ కుడిభాగంలో సీఆర్పీఎఫ్‌ బలగాలను మోహరించింది. ప్రస్తుతం కుడి భాగంలో సీఆర్‌పీఎఫ్‌ బలగాలు ఎవరినీ అనుమతించడం లేదు. అక్కడ ఎలాంటి మరమ్మతులు చేయాల్సి వచి్చనా కృష్ణా బోర్డు అనుమతితోనే రాష్ట్ర ఇంజనీర్లకు అనుమతిస్తున్నాయి. 

జలాశయం భద్రతా చర్యల్లో భాగంగా కుడి భాగంలో సీసీ కెమెరాలతోపాటు పిడుగుల నుంచి రక్షణ కోసం లైట్నింగ్‌ అరెస్టర్లు, సర్జ్‌ ప్రొటెక్షన్‌ పరికరాలను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ చర్యలు చేపట్టింది. ఇందుకోసం తమ ఇంజనీర్లతోపాటు కాంట్రాక్టర్ల సిబ్బందిని అనుమతించాలని రాష్ట్రం విజ్ఞప్తి చేయడంతో బోర్డు అనుమతిచ్చింది.  

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు