ఒడిదుడుకులు తట్టుకోలేక.. ఒకరినొకరు పొడుచుకుని..

Published on Sun, 08/31/2025 - 07:47

హైదరబాద్‌: ఆ భార్యాభర్తలు ఒకరికొకరు తోడు.. నీడగా జీవనం సాగించాలనుకున్నారు.కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలని భావించారు. అయితే వారిని ఆరి్థక ఇబ్బందులు వెంటాడాయి. అప్పుల బాధలు ఎక్కువయ్యాయి. దీంతో ప్రాణం తీసుకోవాలని భావించారు. ఎలా మృతి చెందాలో అర్థం కాలేదు. ప్రాణం తీసుకునే ధైర్యం లేకో.. ఏమో..ఒకరిని ఒకరు కత్తితో పొడుచుకొని చావాలని నిర్ణయించుకున్నారు. నాలుగు రోజుల పాటు ఒకరిని ఒకరు పొడుచుకున్నారు. ఈ క్రమంలో భర్త మరణించగా భార్య తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు..

గుంటూరు జిల్లాకు చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి (45), రమ్యకృష్ణ(38)లు కేపీహెచ్‌బీ కాలనీలో ఉంటున్నారు. రామకృష్ణారెడ్డి  ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో పనిచేస్తుండగా భార్య గృహిణి.   గతంలో నిర్వహించిన వ్యాపారాల్లో ఆర్థికంగా నష్టపోయారు. దీంతో అప్పులు పెరిగిపోయాయి. ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒకరికొకరు గాయపరుచుకోవాలని నిర్ణయించుకున్నారు. గత నాలుగు రోజులుగా ఒకరిని ఒకరు ఉదరభాగం, మణికట్టు, గొంతుపై గాయపరుచుకున్నారు. ఉదర భాగంలో తీవ్ర రక్తస్రావమై రామకృష్ణ శుక్రవారం మృతి చెందగా, రమ్యకృష్ణ తీవ్రంగా గాయపడింది.

శనివారం ఉదయం రమ్యకృష్ణ 100కు డయల్‌ చేసి పోలీసులకు సమాచారం అందించింది. కేపీహెచ్‌బీ పోలీసులు వెళ్లి చూడగా రామకృష్ణ మృతి చెందినట్లు గమనించారు. రమ్యకృష్ణ సోఫాలో కూర్చుని ఉంది. వెంటనే ఆమెను పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కూకట్‌పల్లి ఏసీపీ రవికిరణ్‌ రెడ్డి, కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ రెడ్డి, సెక్టార్‌ ఎస్‌ఐ శ్రీలతా రెడ్డిలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామకృష్ణారెడ్డి మృతదేహాన్ని  గాంధీ ఆసుపత్రికి తరలించారు.  

మూడు నెలల క్రితమే... 
వీరు మూడు నెలల క్రితమే నిర్ణయించుకున్నట్లు రమ్యకృష్ణ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. శుక్రవారం రామకృష్ణ  బలమైన గాయం చేయాలని  రమ్యకృష్ణపై ఒత్తిడి చేయడంతోపాటు తనను తాను గాయపరుచుకునేందుకు యత్నించాడు. తీవ్ర రక్తస్రావంతో రామకృష్ణ మృతి చెందాడు. బెడ్‌ మొత్తం రక్తపు మరకలతో నిండిపోయింది. ఇదిలా ఉండగా పోలీసులు వచ్చే వరకు అపార్టుమెంట్‌లో ఏ ఒక్కరికి కూడా విషయం తెలియకపోవడం, కత్తితో తీవ్రంగా గాయాలు చేసుకున్నప్పటికి ఎవరూ అరవకపోవడం గమనార్హం.   

సూసైడ్‌ నోట్‌ రాసి... 
అవమానాలు భరించలేకపోతున్నాం... ఈ లోకంలో ఉండలేకపోతున్నాం. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాం అని రాసి ఉన్న సూసైడ్‌ నోట్‌ను పోలీసులు రామకృష్ణ గదిలో స్వాధీనం చేసుకున్నారు. పదిహేను రోజుల క్రితం రాసిన ఈ లేఖలో ఆర్థికం ఇబ్బందులుతో పాటు చేతి బదులుగా డబ్బులు ఇచ్చిన వారు తీర్చేందుకు సమయం ఇవ్వకపోవడం అవమానించడం వంటి వివరాలను రాసినట్లుగా ఉంది.   

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)