Breaking News

సత్తన్న ఇంటికి ‘కోమటిరెడ్డి’

Published on Thu, 02/02/2023 - 08:02

నిర్మల్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా జెడ్పీ మాజీచైర్మన్‌ శోభారాణి, బీఆర్‌ఎస్‌ రాష్ట్రనేత సత్యనారాయణగౌడ్‌ దంపతులను మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి కలిశారు. బుధవారం రాత్రి జిల్లా కేంద్రంలోని సత్తన్న ఇంటికి వెళ్లి ఇటీవల కిడ్నీలో రాళ్లకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్న సత్యనారాయణగౌడ్‌ను పరామర్శించారు. ఆయన వెంట బీజేపీ ముధోల్‌ నియోజకవర్గ నేత రామారావుపటేల్, తదితరులు ఉన్నారు.

రాజకీయమేమీ లేదు..
ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేసిన నేతగా గుర్తింపు ఉన్న సత్యనారాయణగౌడ్‌ ఇంటికి రాజ్‌గోపాల్‌రెడ్డి రావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌తో అంటీముట్టనట్టుగా ఉంటున్న సత్తన్న బీజేపీలో చేరుతారా..? ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ను దత్తత తీసుకుంటానని పలుమార్లు ప్రకటించిన కోమటిరెడ్డి అదే విషయంలో ఈయన ఇంటికి వచ్చారా..? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. వీటిపై ‘సాక్షి’వివరణ కోరగా సత్యనారాయణగౌడ్‌ కొట్టిపారేశారు. రాజ్‌గోపాల్‌రెడ్డి బంధువు తనకు క్లాస్‌మేట్‌ అని, ఆక్రమంలో ముందునుంచీ తమకు కొంత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఆదిలాబాద్‌ మీటింగ్‌కు వెళ్లి వస్తూ ఆరోగ్య సమాచారం దృష్ట్యా తనను పరామర్శించడానికి మాత్రమే ఆయన వచ్చారని వివరించారు. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని, పార్టీల చర్చే తమ మధ్య రాలేదన్నారు. తొలిసారి తన ఇంటికి వచ్చినందున శాలువా, జ్ఞాపికతో సత్కరించానని అన్నారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)