Breaking News

నేడు కేంద్రం ఆధ్వర్యంలో ‘విమోచనం’

Published on Tue, 09/17/2024 - 06:11

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం మంగళవారం అధికారికంగా హైదరాబాద్‌ విమోచన దినోత్సవం నిర్వహిస్తోంది. ఉదయం 7.30 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన కళాకారుల ప్రదర్శనలు నిర్వహిస్తారు. ‘నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా’ద్వారా ‘సెప్టెంబర్‌ 17–హైదరాబాద్‌ విమోచన దినం’ప్రాధాన్యత వివరించేలా సంక్షిప్త ప్రదర్శన ఉంటుంది. ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకు పోలీసు బలగాలు, సైనికదళాల పరేడ్‌ ఉంటుంది. 9 గంటలకు కేంద్రమంత్రులు జి.కిషన్‌రెడ్డి, గజేంద్రసింగ్‌ చౌహాన్, బండి సంజయ్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లోని యుద్ధస్మారకం వద్ద నివాళులరి్పస్తారు. ఉదయం 9.15 గంటలకు జి.కిషన్‌రెడ్డి జాతీయపతాకాన్ని ఎగురవేస్తారు.

కేంద్ర మంత్రులు సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటిస్తారు. 9.20 గంటలకు కేంద్ర సాయుధ బలగాల నుంచి కిషన్‌రెడ్డి గౌరవవందనం స్వీకరిస్తారు. అనంతరం 700 మందికిపైగా కళాకారులు మంగళవాద్యం, బతుకమ్మ, కొమ్ముకోయ, బోనాలు–పోతరాజు, డప్పులు, కోలాటం, లంబాడీ, గుస్సాడి, ఒగ్గు కథ తదితరాలను ప్రదర్శిస్తారు. చివరగా ‘హైద రాబాద్‌ విమోచన దినం శకటం ప్రదర్శన ఉంటుంది. 10.10 గంటలకు కేంద్ర సాంస్కృతిక శాఖ సంయుక్త కార్యదర్శి ఉమా నండూరి స్వాగతోపన్యాసం చేస్తారు. తర్వాత బండి సంజయ్‌ ప్రసంగిస్తారు. రాష్ట్రం నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన ఆరుగురిని సన్మానిస్తారు. 10.30 గంటలకు కిషన్‌రెడ్డి ప్రసంగిస్తారు. అనంతరం కేంద్ర సమాచార శాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జి బిషన్‌ను కేంద్రమంత్రులు తిలకిస్తారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు పాల్గొననున్నారు.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)