Breaking News

‘ఇంటెలెక్చువల్స్ కోసం ప్రపంచం భారత్ వైపు చూస్తోంది’

Published on Sun, 04/20/2025 - 15:07

హైదరాబాద్:  కంపెనీల సెక్రటరీలు దేశ కార్పోరేట్ రంగానికి రూపు రేఖలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. దేశ విదేశీ పెట్టుబడిదారులు మనదేశంలో పెట్టబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని, అందుకే మన దేశం గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్ గా వడివడిగా ముందుకు సాగుతోందన్నారు. నగరంలో ఖైరతాబాద్ లోని ఆనంద్ నగర్ కాలనీలో ఐసీఎస్ఐ(ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా)హైదరాబాద్ చాప్టర్ నూతన భవానికి భూమి పూజ చేసిన కిషన్‌రెడ్డి అనంతరం మాట్లాడారు.

‘ICSI హైదరాబాద్ చాప్టర్ నూతన భవనానికి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషంగా ఉంది. కంపెనీ సెక్రటరీలు దేశ కార్పొరేట్ రంగానికి రూపురేఖలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.  దేశ విదేశీ పెట్టుబడిదారులు మనదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. అందుకే మన దేశం గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్ గా వడివడిగా ముందుకు సాగుతోంది.

సత్యం వద(సత్యం పలుకు), ధర్మం చర(ధర్మం ఆచరించు) సూత్రం ఆధారంగా ICSI పనిచేస్తోంది.ప్రతి కంపెనీ సెక్రటరీ ప్రతిరోజు ఈ సూత్రాన్ని ఆధారంగా పని చేస్తే దేశ వ్యాపార రంగం నిజాయితీ పారదర్శకతతో ముందుకు సాగుతుంది.ఇప్పటికే భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. మరో రెండేళ్లలోనే 5 బిలియన్ మార్క్ దాటనుంది.  

ఈ విజయం మీలాంటి ప్రొఫెషనల్స్ హార్డ్ వర్క్, అంకితభావం, విలువలతో కూడిన వ్యాపారం వల్లే సాధ్యమైంది. ఇప్పటికే జర్మనీ, జపాన్ లాంటి దేశాలు మన టాలెంట్ ని గుర్తించి, కంపెనీ సెక్రటరీలు, లాయర్లు,  అకౌంటెంట్లను వారి దేశాల్లో పనిచేసేందుకు నియమించుకుంటున్నాయి. ఇంటెలెక్చువల్స్ కోసం ప్రపంచం భారత్ వైపు చూస్తోంది.

ఇంటలెక్చువల్, ప్రొఫెషనల్ స్కిల్స్ పెంచుకోవడం అంటే కేవలం వ్యక్తిగత అభివృద్ధి మాత్రమే కాదు. సమాజంతోపాటు ప్రపంచ అభివృద్ధికి దోహదపడుతుందని విషయం గుర్తుంచుకోవాలి.భారత్ ఆత్మ నిర్భరత సాధించే దిశగా కంపెనీ ICSI లాంటి సంస్థలు కీలక పాత్ర పోషించాలని ఆశిస్తున్నాను’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)