Breaking News

నిరుద్యోగులు రోడ్డెక్కితే.. దురహంకారంతో అణచివేస్తారా?

Published on Mon, 10/21/2024 - 05:47

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో నియామక పరీక్షల­ను కూడా సరిగా నిర్వహించలేని అసమర్థ ప్రభు­త్వం ఉందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్య­క్షుడు జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. గ్రూప్‌–1 పరీక్షల రీషెడ్యూల్‌ కోరుతూ అభ్యర్థులు రోడ్డెక్కితే వారిపై లాఠీలు ఝలిపించి, దురహంకారంతో అణచివేయాలని చూడటం దారుణమని వ్యాఖ్యా­నించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ‘‘గ్రూప్‌–1 ఉద్యోగాల ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షలకు ఒకే తరహా నిబంధనలుండాలి. ఆ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఒకే హాల్‌టికెట్‌ ఉండాలి.

కానీ టీజీపీఎస్సీ రెండుసార్లు జారీ చేయడం ఏమిటి? పరీక్షలన్నీ హైదరాబాద్‌ పరిసరాల్లోనే నిర్వహించడానికి కారణాలు ఏమిటి? ఇలా ఒకేచోట పరీక్షల నిర్వహ­ణపై పలు అనుమానాలు వస్తున్నాయి. గ్రూప్‌–1 మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపికలో అమలు చేసిన జీవో 29 విషయంలో అభ్యర్థులకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఇందులో ఎలాంటి దాపరికం లేకపోతే స్పష్టత ఎందుకు ఇవ్వడం లేదు?’’అని కిషన్‌రెడ్డి నిలదీశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాం«దీతో కలసి అశోక్‌నగర్‌లో నిరుద్యోగులతో మాట్లాడిన మాటలేమిటి? ఇప్పుడు చేస్తున్న పనులేమిటి? ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని సీఎం రేవంత్‌కు సూచించారు. 

హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించే యత్నాలు 
న్యాయం కావాలని రోడ్డెక్కిన నిరుద్యోగులపై లా­ఠీ­చా­ర్జి చేయడం, నిరసనలను అణచివేసే ప్రయ­త్నం చేయడం, అరెస్టులకు దిగడం దారుణమని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా పేదల ఇళ్లను కూలి్చవేస్తూ కాలం గడిపే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. హామీలు అమలు చేసే సత్తా, శక్తి, లేకనే.. కొత్త సమస్యలు సృష్టించి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. సీఎం రేవంత్‌ పూర్తిగా హిందూ వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు.

వినాయక చవితి, బోనాలు, దేవీ నవరాత్రుల సందర్భంగా అనేక మందిపై కేసులు పెట్టించారని.. డీజే సౌండ్‌ పెట్టారంటూ మండపాల నిర్వాహకులను వేధించారని పేర్కొన్నారు. ఇతర వర్గాల ప్రార్థన కేంద్రాల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వస్తున్న శబ్దాలు పోలీసులకు, ముఖ్యమంత్రికి వినబడవా? కనబడవా? అని ప్రశ్నించారు. ముత్యాలమ్మ గుడి వద్ద నిరసనకారులపై అత్యంత పాశవికంగా దాడి చేయాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. ఒక కార్యకర్తకు తీవ్రగాయాలు అయ్యాయని, పోలీసులు అతడిని ఇంట్లో వదిలివెళ్లారని.. కానీ అతడి పరిస్థితి విషమిస్తుండటంతో తాము ప్రైవేట్‌ఆస్పత్రికి తరలించి చికిత్స అందేలా చూశామని చెప్పారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)