ఉదయనిధి స్టాలిన్‌ అరెస్ట్‌పై కిషన్‌ రెడ్డి కీలక కామెంట్స్‌

Published on Tue, 08/04/2026 - 17:19

ఢిల్లీ: తమిళనాడులో కాంగ్రెస్ మద్దతుతో ఉన్న టీవీకే ప్రభుత్వంలో సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ను అరెస్ట్ చేశారని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి గుర్తుచేశారు. మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కేసులు నమోదు చేసిన అధికారులను ఎందుకు శిక్షిస్తోందని నిలదీశారు. రేపు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కూడా ఇలానే వదిలేస్తారా? అని ప్రశ్నించారు.

ఢిల్లీలో కిషన్‌ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై  ఫిర్యాదు చేయడం రాజ్యాంగ హక్కు అని తెలిపారు. మెటాపై కేసు నమోదు చేసిన డీసీపీ ఆనంద్ బాబుని తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసిందని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం పని చేసిన అధికారిని శిక్షించారని తెలిపారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి డీసీపీ ట్రాన్స్‌ఫర్‌ చేశారని తెలిపారు. చట్ట ప్రకారం నడిచే అధికారులపై వేటు వేస్తున్నారని అన్నారు. గత కేసీఆర్‌ ప్రభుత్వం ట్యాపింగ్ చేసి అధికార దుర్వినియోగం చేసిందని, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం అదే తరహాలో వ్యవహరిస్తోందని చెప్పారు.

సింగరేణిపై మాజీ సీఎం కేసీఆర్‌తో చర్చకు తాను సిద్ధమని, ఆయన కుటుంబం వల్ల అప్పుల పాలైందని కిషన్ రెడ్డి చెప్పారు. సింగరేణిని ఆదుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి సింగరేణికి రావాల్సిన 54 వేల కోట్ల రూపాయలు బకాయిలు కట్టిస్తామని చెప్పారు. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)