Breaking News

ఏం సాధించిందని కాంగ్రెస్‌ సర్కార్‌ విజయోత్సవాలు

Published on Mon, 12/08/2025 - 00:52

నల్లగొండ టౌన్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం గత రెండేళ్ల కాలంలో ఏం సాధించిందని ప్రజా పాలన విజయోత్సవాలను జరుపుకుంటున్నారో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు తెలియజేయాలని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన నల్ల గొండలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, బీఆర్‌ఎస్‌ గత 10 సంవత్సరాల కాలంలో ఏం చేసిందో ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల్లో అదే చేసిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులతో పాటు అవినీతిలో కూడా గత బీఆర్‌ఎస్‌ కంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుందని ఎద్దేవా చేశారు.

ఆరు గ్యారంటీలు, 420 సబ్‌ గ్యారంటీలలో ఏమేమి అమలు చేశారో స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రెండు సంవత్సరాల కాలంలో సింగరేణి నుంచి హైటెక్‌ సిటీ వరకు భూముల అమ్మకాల్లో గత బీఆర్‌ఎస్‌ కంటే కాంగ్రెస్‌ సర్కార్‌ ముందు నిలిచిందన్నారు. భూముల ఆక్రమణలో మంత్రుల నుంచి కింది స్థాయి కాంగ్రెస్‌ నాయకుల వరకు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనకు ప్రస్తుత కాంగ్రెస్‌ పాలనకు పెద్దగా తేడా ఏమీ లేదన్నారు. రానున్న కాలంలో కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)