Breaking News

బాబాయ్ నిలిపిన ప్రాణం

Published on Sat, 12/06/2025 - 18:31

హైద‌రాబాద్‌, సాక్షి : ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాల‌జీ (ఏఐఎన్‌యూ) ఆస్ప‌త్రిలో 25 ఏళ్ల యువ‌కుడికి ఆయ‌న చిన్నాన్న ఇచ్చిన కిడ్నీని విజ‌య‌వంతంగా మార్చారు. కిడ్నీ మార్పిడి కేసుల‌లో సొంత బంధువులు ఇవ్వ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌కు ఈ కేసు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుందనీ  జన్యుప‌ర‌మైన సానుకూల‌త‌ల కార‌ణంగా కుటుంబంలోంచి ఎవ‌రైనా కిడ్నీ దానం ఇస్తే అది బాగా విజ‌య‌వంతం అవుతుందనీ ఏఐఎన్‌యూ వెల్లడించింది.

కోన‌సీమ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువ‌కుడు.. బీటెక్ చ‌దివి, హైద‌రాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ప‌నిచేస్తున్నారు. సుమారు రెండేళ్ల క్రితం ఉన్న‌ట్టుండి అత‌డికి త‌ల‌నొప్పి, వాంతులు త‌ర‌చు అవ్వ‌డం మొద‌లైంది. ఏంటా అని వైద్యుల‌కు చూపించుకుంటే సీరం క్రియాటినైన్ బాగా పెరిగింద‌ని ర‌క్త‌ప‌రీక్ష‌ల్లో తేలింది. మ‌రిన్ని ప‌రీక్ష‌ల అనంత‌రం.. అత‌డికి దీర్ఘ‌కాల కిడ్నీ వ్యాధి (సీకేడీ) ఉంద‌ని తెలిసింది. దీంతో ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ (ఏఐఎన్‌యూ) వైద్యుల‌ను సంప్ర‌దించాడు.   సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ నెఫ్రాల‌జిస్ట్, ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియ‌న్ డాక్ట‌ర్ శ్రీ‌కాంత్ గుండ్ల‌ప‌ల్లి ఆధ్వర్యంలో చికిత్స అందించి, కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ విజయవంతంగా  ముగించారు.

సాధార‌ణంగా ఇంత చిన్న వ‌య‌సులో ఎలాంటి దుర‌ల‌వాట్లు లేనివాళ్ల‌కు ఇలాంటి స‌మ‌స్య‌లు రావ‌డం అరుదు. కానీ, రోగ‌నిరోధ‌క శ‌క్తి కార‌ణంగా కొన్నిసార్లు ఇలా కావ‌చ్చని వైద్యులు తెలిపారు. మరోవైపు   కిడ్నీని దానం చేసేందుకు  త‌ల్లిదండ్రుల ర‌క్తం గ్రూపులు ఆ యువ‌కుడి గ్రూపుతో క‌ల‌వ‌లేదు. దానికితోడు  వారి ఆరోగ్య పరిస్థితులు కూడా   దానానికి అనుగుణంలేదు. దీంతో అత‌డి చిన్నాన్న ముందుకు రావ‌డంతో లాప‌రోస్కొపిక్ ప‌ద్ధ‌తిలో కిడ్నీ సేక‌రించి, దాన్ని యువ‌కుడికి అమ‌ర్చామని డా. శ్రీ‌కాంత్ వివ‌రించారు.

చిన్న‌ప్ప‌టి నుంచి ఉన్న బంధంతోనే..
ఇంత‌కుముందు  తనకెలాంటి స‌మ‌స్య లేదు,  చెడు అల‌వాట్లు కూడా లేవని  యువకుడు తెలిపారు. 2023 డిసెంబ‌ర్ నుంచి అప్పుడ‌ప్పుడు వాంతులు, త‌ల‌నొప్పి రావ‌డంతో వైద్యులను సంప్రదించానని చెప్పారు.  కిడ్నీ మార్పడి అవసరమని వైద్యులు తేల్చి చెప్పారు. అమ్మానాన్న‌ల నుంచి కిడ్నీ తీసుకోలేని ప‌రిస్థితి ఉండ‌డంతో, తన ప‌రిస్థితి చూసి చ‌లించిపోయి  బాబాయ్‌ కిడ్నీని దానం చేసేందుకు  ముందుకొచ్చారన్నారు.  మా పిన్ని, వాళ్ల పిల్ల‌లు కూడా ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌లేదు. దాంతో విజ‌య‌వంతంగా కిడ్నీ మార్పిడి చేశారు. బాబాయ్ పూర్తిగా కోలుకుని ప‌ని చేసుకుంటున్నారు. నాకు కూడా ఇప్పుడు అంతా బాగానే ఉంది’’ అని ఆ యువ‌కుడు చెప్పాడు.

యూరాల‌జీ రోబోటిక్ స‌ర్జ‌రీ, యూరో-ఆంకాల‌జీ, రీక‌న్‌స్ట్ర‌క్టివ్ యూరాల‌జీ, నెఫ్రాల‌జీ, కిడ్నీ మార్పిడి, డ‌యాల‌సిస్, మ‌హిళ‌ల యూరాల‌జీ, పీడియాట్రిక్ యూరాల‌జీ, పురుషుల ఆరోగ్యం, ఆండ్రాల‌జీ. భార‌త‌దేశంలో యూర‌లాజిక‌ల్ శ‌స్త్రచికిత్స‌ల‌లో విశేష సేవలందిస్తోందని ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ గురించి విభాగం వెల్లడించింది.

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)