Breaking News

Hyderabad: గచ్చిబౌలిలో కిడ్నాప్‌ కలకలం

Published on Wed, 09/04/2024 - 19:31

హైదరాబాద్‌, సాక్షి: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలను కిడ్నాప్‌ చేయడానికి ఓ వ్యక్తి యత్నించాడు. అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ అప్రమత్తం కావటంతో ప్రమాదం తప్పింది. కొండాపూర్ మజీద్ బండలో ఓ ప్రైవేట్  స్కూల్‌కి వెళ్లేందుకు పిల్లలు ఆటో కోసం చూశారు. అయితే.. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆ పిల్లలు చేయిపట్టుకొని ఆటోలో ఎక్కించాడు. అనంతరం ఆటో మజీద్ బండ స్మశానవాటికవైపు వేళ్తుండటంతో అనుమానం వచ్చిన చిన్నారులు ఆ వ్యక్తిని ప్రశ్నించారు. 

అప్రమత్తం అయిన ఆటో డ్రైవర్ పిల్లలతో పాటు ఉన్న కిడ్నాపర్ పట్టుకొని సమీపంలో ట్రాఫిక్ పోలీసులకు అప్పగించాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ చందానగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఉదయం 9 గంటలకు చందానగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన చిన్నారులు సుమారు 8 గంటల పాటు స్టేషన్‌లో ఉన్నారు. కిడ్నప్ ఘటనస్ధలం తమ పరిధిలోకి రాదంటూ సాయంత్రం గచ్చిబౌలీ పోలీసులకు అప్పగించారు. సకాలంలో స్పందించి తమ పిల్లలను కిడ్నాపర్‌ నుంచి రక్షించిన ఆటో డ్రైవర్‌ను పిల్లల కుటుంబ సభ్యులు అభినందించారు. కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్న  గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. 
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)