Breaking News

‘విక్రమ్‌–1’లో మన వినయ్‌!

Published on Mon, 07/20/2026 - 13:02

శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) నుంచి తొలిసారి ప్రయోగించిన భారతీయ ప్రైవేట్‌ రాకెట్‌ విక్రమ్‌–1(ఆగమన్‌) ప్రయోగం ఇటీవల విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ కంపెనీ ఈ రాకెట్‌ను రూపొందించగా.. ఈ బృందంలో ఖమ్మం జిల్లా  యువకుడు వినయ్‌కుమార్‌ ఇంజనీర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.

వ్యవసాయం కుటుంబం..
జిల్లాలోని రఘునాథపాలెం మండల కేంద్రానికి చెందిన వ్యవసాయ కుటుంబంలో వినయ్‌కుమార్‌ జన్మించాడు. పదో తరగతి తర్వాత పాలిటెక్నిక్‌ మూడేళ్లు, ఆతర్వాత లేటరల్‌ ఎంట్రీగా ఇంజనీరింగ్‌ మూడేళ్లు పూర్తిచేశాడు. ఖమ్మం రూరల్‌ మండలం పొన్నేకల్‌లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్‌ కాలేజీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన ఆయన ఆతర్వాత ప్రయోగాలపై ఆసక్తి పెంచుకున్నాడు. ఈక్రమాన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ కంపెనీలో చేరాడు.

ఇందులో భాగంగానే విక్రమ్‌–1 ప్రయోగంలో పాలుపంచుకోగా విజయవంతం కావడంపై పలువురు అభినందిస్తున్నారు. కాగా, శ్రీచైతన్య కాలేజీ చైర్మన్‌ మల్లెంపాటి శ్రీధర్‌ మాట్లాడుతూ తమ కాలేజీ పూర్వ విద్యార్థి వినయ్‌కుమార్‌ తొలి ప్రైవేట్‌ రాకెట్‌ తయారీ, ప్రయోగంలో పాలుపంచుకోవడం గర్వకారణమని తెలిపారు. ఆయనను శ్రీధర్‌తో పాటు డైరెక్టర్‌ మల్లెంపాటి శ్రీవిద్య, ప్రిన్సిపాల్‌ ఎస్‌.లక్ష‍్మీనారాయణ, ఎగ్జిక్యూటివ్‌ డీన్‌ డాక్టర్‌ వి.సుదర్శన్, వివి విభాగాల అధిపతులు వైశాలి, డాక్టర్‌ చార్యులు, కుమార్‌ తదితరులు అభినందించారు.

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)