Breaking News

‘సృష్టి’ కేసులో మరో కీలక మలుపు

Published on Wed, 08/06/2025 - 22:18

సాక్షి, హైదరాబాద్‌: ‘సృష్టి’ కేసులో గోపాలపురం పోలీసులు దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సికింద్రాబాద్‌కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్‌ లెటర్‌ హెడ్‌లను వాడి నమ్రత పలువురికి ఇంజక్షన్లు, మందులు ఇచ్చినట్లు తేలింది. తన పేరుతో ఉన్న లెటర్‌ హెడ్‌ చూసి షాక్‌ తిన్న.. ఆ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ నమ్రతపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరోగసి పేరుతో 80 మంది పిల్లలను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.

పిల్లలను అమ్ముకున్నట్టు అంగీకరించిన  నమ్రత.. వేర్వేరు ప్రాంతాల నుంచి పిల్లలను సేకరించామని.. అందరికీ డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశామని తెలిపారు. అయితే, ఏజెంట్‌ల వివరాలు లేవంటూ ఆమె చెప్పింది. 80 మంది పిల్లల తల్లిదండ్రుల వివరాలపై పోలీసుల ఆరా తీస్తున్నారు. మళ్లీ నమ్రతను కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్‌ వేశారు. పలు రాష్ట్రాలకు చెందిన 9 మంది ఏజెంట్లను అరెస్ట్‌ చేశారు. వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. ఈ కేసులో అరెస్ట్‌ల సంఖ్య మొత్తం 26కి చేరింది.

కాగా, ఈ కేసులో నిందితురాలైన విద్యుల్లతకు బెయిల్‌ లభించింది. కేసులో ఏ16గా ఉన్న ఆమెకు సికిం‍ద్రాబాద్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఆమెను సోమవారం.. ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో డాక్టర్ విద్యులత ఉన్నారు. A3 కల్యాణి, A6 సంతోషిల ఐదు రోజుల కస్టోడీయల్ విచారణ నేటితో ముగిసింది. నిందితులను గోపాలపురం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

 

 

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)