Breaking News

Meerpet Case: రోలును తిరగేసి.., పొత్రంతో పొడిచేసి!

Published on Tue, 01/28/2025 - 07:09

సాక్షి, హైదరాబాద్‌: ‘భార్యను చంపి, ఉడకబెట్టిన’ కేసులో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు గురుమూర్తి భార్య మృతదేహాన్ని ముక్కలు చేశాక..ఉడకబెట్టడానికి కాస్టిక్‌ సోడాను, ఎముకలను పొడి చేయడానికి రోలు, పొత్రం వినియోగించాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్టు తెలిసింది. భార్యను చంపిన తర్వాత మృతదేహాన్ని మాయం చేయడానికి ఓ సినిమాతోపాటు ఇంటర్‌నెట్‌లో సెర్చ్‌ చేయడం ద్వారా లభించిన వీడియోలను చూసి ఈ ప్లాన్‌ అమలు చేశాడని గుర్తించినట్టు సమాచారం. 

ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఇదే పనిలో ఉన్నాడని తేల్చినట్టు తెలిసింది. రాచకొండ పోలీసు కమిషనరేట్‌లోని మీర్‌పేట పరిధి జిల్లెలగూడలో జరిగిన వెంకట మాధవి హత్య కేసులో పోలీసులు ఒక్కో చిక్కుముడి విప్పుతున్నారు. ఆధారాలు సేకరించడానికి ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న ఫోరెన్సిక్‌ నిపుణులను సంప్రదిస్తూ సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. 

బయటికెళ్లి సామగ్రి కొనుక్కొచ్చి.. 
ఈ నెల 14న రాత్రి గొడవ జరగడంతో గురుమూర్తి మాధవి తలను బలంగా గోడకేసి కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి, కాసేపటికే మరణించింది. గురుమూర్తి మరుసటి రోజున ఐదుసార్లు ఇంట్లోంచి బయటికి వెళ్లి వచి్చనట్టు సీసీ కెమెరాల్లో రికార్డయింది. అలా వెళ్లి వస్తూ మాంసం కొట్టే మొద్దు, కత్తి, కాస్టిక్‌ సోడా, కొత్త వాటర్‌ హీటర్‌ కొనుక్కువచి్చనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని బాత్‌రూమ్‌లోకి లాక్కుపోయిన గురుమూర్తి..అక్కడే మాంసం కొట్టే మొద్దుపై కత్తితో ముక్కలు చేశాడు. పెద్ద బకెట్‌లో హీటర్‌ పెట్టి నీళ్లు మరిగిన తర్వాత ముక్కల్ని అందులో వేశాడు. 

మాంసం పూర్తిగా ఉడికిపోయి విడిపోవడానికి అందులో కాస్టిక్‌ సోడా కలిపి ఉంటాడని.. ఉడికిపోయాక కమోడ్‌లో వేసి ఫ్లష్‌ చేసి ఉంటాడని ఫోరెన్సిక్‌ నిపుణులు చెప్తున్నారు. ఇక ఎముకలను స్టవ్‌ మీద పెట్టి కాల్చి..తర్వాత రోలుపై పెట్టి పొత్రంతో కొట్టి పొడిగా మార్చాడని పోలీసులు నిర్ధారించినట్టు తెలిసింది. తర్వాత ఎముకల పొడి, కత్తిని జిల్లెలగూడ చెరువులో పారేసినట్టు సమాచారం.

మృతదేహాన్ని మాయం చేయడం పూర్తయ్యాక ఆధారాలేవీ చిక్కకుండా రోలు, పొత్రం, మొద్దును, బాత్‌రూమ్‌ను పలుమార్లు కడిగేశాడని...పదే పదే నీటిని ఫ్లష్‌ చేస్తూ డ్రైనేజీలోనూ ఎలాంటి ఆనవాళ్లు మిగలకుండా చేశాడని పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. అయితే ఫోరెన్సిక్‌ నిపుణులు స్టవ్‌పై చిన్న మాంసం ముక్క, వెంట్రుకలతోపాటు మాధవి తలను గోడకు కొట్టిన చోట రక్తపు మరకల్ని గుర్తించారని..డీఎన్‌ఏ పరీక్షలు చేయించాలని నిర్ణయించారని సమాచారం.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌