Breaking News

రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ మోసాన్ని ప్రజల్లో ఎండగట్టండి

Published on Fri, 10/10/2025 - 05:04

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన జీవో–9పై హైకోర్టు స్టే ఇవ్వడం, ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం నిలిపేసిన నేపథ్యంలో గురువారం రాత్రి ఎర్రవల్లి నివాసంలో బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ సీఎం కె. చంద్రశేఖర్‌రావు కీలక భేటీ నిర్వహించారు. తాజ పరిణామాలపై పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారక రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో చర్చించారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసగించిన తీరును ప్రజల్లో ఎండగట్టాలని కేసీఆర్‌ ఆదేశించారు. 

బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని.. అసెంబ్లీ లోపలా, బయటా బీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించినా జీవోకు చట్టబద్ధత సాధించడంలో రేవంత్‌ ప్రభుత్వం విఫలమైందని కేసీఆర్‌ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేలా త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక సన్నద్ధతపైనా ఈ భేటీలో కేసీఆర్‌ సమీక్షించారు. ఐదుగురు మాజీ మంత్రుల నేతృత్వంలో ఏర్పాటైన వార్‌ రూమ్‌ పనిచేయాల్సిన తీరుపై ఆయన దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. 

కాంగ్రెస్‌ అభ్యర్థిగా నవీన్‌ యాదవ్‌ ఎంపికైన నేపథ్యంలో ఆ పార్టీ అనుసరించే వ్యూహం, అభ్యర్థి బలాబలాలను విశ్లేషించి పలు సూచనలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడినందున గ్రామీణ ప్రాంత నేతలు, కేడర్‌ను కూడా జూబ్లీహిల్స్‌ ప్రచారంలో భాగస్వాములను చేయాలని కేసీఆర్‌ ఆదేశించారు. దీంతో ఉపఎన్నిక ప్రచార వ్యూహానికి తుదిరూపు ఇచ్చేందుకు కేటీఆర్, హరీశ్‌రావు ఒకట్రెండు రోజుల్లో పార్టీ డివిజన్‌ ఇన్‌చార్జీలు, ముఖ్య నేతలతో భేటీ కానున్నారని సమాచారం.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)