Breaking News

ఏఐజీ ఆసుపత్రికి కేసీఆర్‌.. రెండోరోజు ఆరోగ్య పరీక్షలు!

Published on Sat, 06/14/2025 - 11:32

సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ (KCR) అనారోగ్యంతో ఉన్నట్టు తెలుస్తోంది. గత రెండు రోజులుగా కేసీఆర్‌.. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌తో కేటీఆర్, హరీష్ రావు కూడా ఆసుప్రతికి వచ్చారు.

వివరాల ప్రకారం.. కేసీఆర్‌ శనివారం మరోసారి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. వైద్య పరీక్షల కోసం అక్కడికి చేరుకున్నారు. అయితే, నిన్న కొన్ని టెస్టుల తర్వాత ఈ రోజు మరోసారి ఆసుపత్రికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆరోగ్య పరీక్షల్లో భాగంగా కేసీఆర్‌ శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆసుపత్రికి వచ్చిన ఆయన.. గంట పాటు అక్కడే ఉన్నారు. ఏఐజీ ఛైర్మన్, ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్‌కు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలపై వైద్యులు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

ఇక, కేసీఆర్‌.. గత కొన్ని రోజుల నుంచి జలుబుతో బాధపడుతున్నారు. వైద్య పరీక్షలు పూర్తి అయిన వెంటనే నందినగర్ నివాసానికి వెళ్లనున్నారు. మరో ఐదు రోజుల పాటు బంజారా హిల్స్‌లోని నందీనగర్ నివాసంలోనే కేసీఆర్ ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఎర్రవల్లి ఫాం హౌస్‌లోని బాత్ రూంలో కాలు జారీ పడటంతో గాయమైన విషయం తెలిసిందే. అనంతరం, యశోద ఆస్పత్రిలో కొన్ని రోజుల పాటు చికిత్స పొందారు. ఆ తర్వాత ఫాం హౌస్ లోనే రెస్ట్ తీసుకుంటున్నారు.

KCRకు వైద్య పరీక్షలు

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)