Breaking News

50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ ఏం చేసింది : సీఎం కేసీఆర్‌

Published on Fri, 11/03/2023 - 16:45

సాక్షి, నిజామాబాద్‌:  ఉమ్మడి ఏపీలో యాభై ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు చేసిందేమీ లేదని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. శుక్రవారం నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడారు. మూడు గంటల కరెంట్‌ కావాలా 24 గంటల కరెంట్‌ కావాలో తేల్చుకోవాలని ప్రజలను కోరారు.

 రైతు బంధు దుబారా అని కాంగ్రెస్సోళ్లు అంటున్నారని, రైతు బంధు కావాలా వద్దా అనేది ప్రజలు తేల్చుకోవాలన్నారు.ఎవరో చెప్పారని ఓటు వేయద్దని ఏ పార్టీ మంచి చేసిందో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ప్రజల చేతిలో ఉన్న వజ్రాయుధం ఓటన్నారు. ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణితి ఇంకా రాలేదన్నారు. సరైన పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు.  

 ‘అంకాపూర్ అంటే నాకు బాగా ఇష్టం. అంకాపూర్‌ను రైతులు ఆదర్శంగా తీసుకొని ఎదగాలి. తెలంగాణ రాక ముందు కరెంటు లేదు. తాగునీరు సాగు నీరు లేదు.. వలసలు ఉండేవి. దళిత బందు పథకం కనిపెట్టిందే నేను. దేశంలోనే బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే. ధరణి తీసేస్తామని కాంగ్రెస్‌ వాళ్లు అంటున్నారు. తీసేస్తే రైతు బంధు ఎవరికి ఇస్తారు. ధరణి లేకపోతే మళ్లీ వీఆర్‌వోలు వస్తారు. మళ్లీ అవినీతి వస్తుంది. ప్రజల మధ్యే ప్రజల కోసం ఉండే జీవన్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి’అని కేసీఆర్‌ కోరారు.

బైంసా ‌సభలో కేసీఆర్‌...
 ‘ఓటు   చేతిలో  నుంచి జారిపోక ముందే  అలోచించాలని, ఓటు వేయడంలో తప్పిదం  జరిగితే   తీవ్రంగా నష్టపోతాం. 24 గంటల  కరెంట్ వద్దని  రేవంత్ రెడ్డి అంటున్నారు. మహరాష్ట్రలో  కరెంటు లేదు. మనదగ్గర కరెంటు ఉంది. ముథోల్, తానూర్, లోకేశ్వరం ‌మండలాల్లోని యాభై వేల ఎకరాలకు ఎస్సారేస్పీ  నీరు అందిస్తాం. ప్రదానికి మోడికి పిచ్చి పట్టింది.  విమానాలు, రైల్వేలు   అన్ని ప్రైవేటు పరంచేస్తున్నారు. బైంసాలో బీజేపీ అభ్యర్థిని నిలదీయండి. ఎందుకు మోటర్లకు మీటర్లు పెడుతారని ప్రశ్నించండి. బైంసా  అంటేనే  యుద్దం అన్నట్లుగా చిత్రీకరిస్తు‌న్నారు. మతం పేరుతో  మంటలు చేలరేగాలనా. రక్తం పారలనా..మీరే అలోచించుకోండి’అని  కేసీఆర్‌ ప్రజలను కోరారు.  

ప్రజాస్వామ్యంలో పరిణితి రావాలి..
‘దేశ ప్రజాస్వామ్యంలో ఇంకా పరిణితి రావాలి. పోటీలో ఉన్న అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ చరిత్రను చూసి ప్రజలు ఓటు వేయాలి. ఎవరో చెప్పారని ఓటు వేయొద్దు.తెలంగాణ రాకముందు పరిస్థితులు ఎలా ఉండేవో ఒకసారి గుర్తు చేసుకోవాలి.ఇప్పుడు తెలంగాణ ఎలా ఉందో చూడాలి. తెలంగాణ వచ్చినంకనే ఇంటింటికి నీళ్లిచ్చాం.24 గంటల కరెంట్‌ ఇచ్చాం.చేనేత కార్మికుల సంక్షేమానికి బడ్జెట్‌ పెంచుతాం. చేనేత కార్మికుల కష్టాలు నాకు తెలుసు.ధరణి తీసేస్తామని కాంగగ్రెస్‌ అంటోంది.ధరణి ఉండాలన్నా వద్దా తేల్చుకోవాలి’అని కోరుట్ల సభలో కేసీఆర్‌ ప్రజలను కోరారు.

Videos

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

జూడో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం

Photos

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)