Breaking News

Telangana: కేసీఆర్‌ బస్సు యాత్ర షెడ్యూల్‌ ఖరారు

Published on Fri, 04/19/2024 - 18:57

సాక్షి, హైద‌రాబాద్: లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేపట్టనున్న బ‌స్సు యాత్ర  షెడ్యూల్‌ ఖరారైంది.  ఈ నెల 22 నుంచి మే 10వ తేదీ వ‌ర‌కు తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ బ‌స్సు యాత్ర చేప‌ట్ట‌నున్నారు. ఈ క్ర‌మంలో కేసీఆర్ బ‌స్సు యాత్ర అనుమతి రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి వికాస్ రాజ్‌ను బీఆర్ఎస్ నాయ‌కులు కే వాసుదేవా రెడ్డి శుక్ర‌వారం క‌లిశారు. 

బ‌స్సు యాత్ర వివ‌రాల‌ను వికాస్ రాజ్‌కు వాసుదేవా రెడ్డి అంద‌జేశారు. ఈ నేప‌థ్యంలో యాత్ర‌కు సంబంధించి భ‌ద్ర‌తా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. యాత్ర‌కు పోలీసుల స‌హ‌కారం అందించేలా చూడాల‌ని కోరారు. ఎన్నిక‌లు పార‌ద‌ర్శ‌కంగా, ప్ర‌శాంతంగా జ‌రిగేలా చూడాల‌ని వాసుదేవా రెడ్డి కోరారు.

కాగా కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎత్తిచూపుతూ.. బీర్‌ఎస్‌ పార్టీకి పూర్వవైభవం తీసుకురావడమే ధ్యేయంగా కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌స హయాంలో చేపట్టిన కార్యక్రమాలు, వాటి ద్వారా కలిగిన లబ్ధిని ప్రజలకు వివరించేలా ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారం కోసం ఈనెల చివరి వారం నుంచి బస్సు యాత్ర చేయనున్నారు, సాయంత్రం సమయాల్లో ఒక్కో లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో రెండు, మూడు చోట్ల రోడ్‌షోలు ఉండనున్నాయి.

రెండు, మూడు వారాల పాటు జరిగే ఈ బస్సు యాత్రలో భాగంగా ఉదయం పూట పంట పొలాలు, కల్లాలు, కొనుగోలు కేంద్రాల సందర్శనతోపాటు వివిధ వర్గాలతో భేటీ అవుతారు. బస్సుయాత్రలో తన వెంట వచ్చే బృందానికి బస ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో లక్ష మందితో మినీ సభలు కూడా ఏర్పాటు చేద్దామన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)