Breaking News

హైకోర్టులో ‘కార్వీ’కి ఊరట 

Published on Tue, 02/14/2023 - 02:06

సాక్షి, హైదరాబాద్‌: కార్వీ గ్రూప్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఈడీ ఎడ్జుడికేటింగ్‌ అథారిటీ జారీ చేసిన షోకాజ్‌ నోటీసులపై సమాధానం ఇవ్వడానికి కార్వీకి హైకోర్టు సింగిల్‌ జడ్జి రెండు నెలల సమయం ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ ఈడీ సీజే ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేసింది. వాదనలు విన్న ధర్మాసనం అప్పీల్‌ను కొట్టివేసింది. ఖాతాదారులకు చెందిన షేర్లను తాకట్టు పెట్టి రుణం పొంది వాటిని డొల్ల కంపెనీలకు మళ్లించారన్న ఆరోపణలపై కార్వీపై మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసిన ఈడీ... షేర్లు, భూములు, భవనాలు, విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలను జప్తు చేయడం తెలిసిందే.

దీన్ని సవాల్‌ చేస్తూ సంస్థ సీఎండీ పార్థసారథి సహా మరికొందరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి... ఈడీ ఎడ్జుడికేటింగ్‌ అథారిటీ ఆస్తుల జప్తు నోటీసులపై సమాధానం ఇవ్వడానికి కార్వీకి 2 నెలల సమయం ఇచ్చారు. ఈ తీర్పును తప్పుబడుతూ ఈడీ అప్పీల్‌ దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ తుకారాంజీ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.

ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అథారిటీ 180 రోజుల్లో రిపోర్టు అందజేయాల్సి ఉంటుందని, అదనంగా సమయం ఇవ్వడం సరికాదన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. సమయ వెసులుబాటు ఇచ్చే అధికారం కోర్టులకు ఉంటుందని స్పష్టం చేసింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన రెండు నెలల గడువు మరో వారంలో ముగియనుండగా ఇప్పడు సవాల్‌ చేయడాన్ని తప్పుబడుతూ అప్పీల్‌ను కొట్టివేసింది.    

Videos

బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?

జియో రూ.111 రీఛార్జ్ మతిపోగొట్టే బెనిఫిట్స్

నేషనల్ అవార్డు... క్యాష్ బహుమతిగా ఇస్తే, ఈ రోజు లోకేష్ జాబ్ ఇవ్వకుండా చేశాడు

నేను వస్తున్నానా లేదా అని నా అడ్వకేట్ ఇంటికి CCకెమెరాలు పెట్టించడం ఏంటీ

కులం గొప్పది కాదు మానవత్వం గొప్పది

మజ్జి శ్రీను పార్టీ మారడంపై బొత్స ఇంటి వద్ద అత్యవసర మీటింగ్

బాబును ఇమిటేట్ చేస్తూ ఏకిపారేసిన జగన్

కూకట్ పల్లి హోటల్ లో దారుణం కుళ్లిన 30 కేజీల మటన్, 20 కేజీల చికెన్

అందర్నీ కొనేసింది.! షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాధితుడు

పాన్ ఇండియా బరిలోకి దిగుతున్నారా? డిసెంబర్ లో ఒకేసారి సినిమాలు

Photos

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)

+5

‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)