Breaking News

క‌ళ్లెదుటే క‌న్న‌కొడుకు సజీవ దహనం.. పాపం ఆ త‌ల్లి..

Published on Sat, 10/05/2024 - 12:55

మానకొండూర్‌:  ఆరేళ్ల బాలుడు మిట్టమధ్యాహ్నం ఇంట్లో గాఢనిద్రలో ఉన్నాడు.. హఠాత్తుగా శరీరానికి వేడి తాకింది. నిద్రలోంచి తేరుకున్న ఆ చిన్నారి చుట్టూ మంటలు.. అమ్మా.. అమ్మా.. అంటూ హాహాకారాలు చేస్తూ ప్రాణాలు కాపాడుకునేందుకు మరోగదిలోకి పారిపోయాడు. ఇంటి ఆవరణలో కొంత దూరంలో ఉన్న తల్లి మంటలను గమనించింది. కొడుకును కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఊపిరాడక ఆ చిన్నారి ప్రాణాలు వదిలాడు. కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం ఈదులగట్టెపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన ఈ విషాదంపై స్థానికులు తెలిపిన వివరాలివి.

ఈదులగట్టెపల్లి గ్రామానికి చెందిన అగ్గిడి రాజు, అనిత దంపతులకు రితిక, కొడుకు సాయికుమార్‌ (6) సంతానం. సాయికుమార్‌ కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు. రాజు ఆటో డ్రైవర్, అనిత కూరగాయలు అమ్ముతుంది. దీంతోపాటు సీజన్‌లో టార్పాలిన్లు (పరదాలు) కిరాయికి ఇస్తూ ఉపాధి పొందుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో కూలర్‌ వేసుకుని సాయికుమార్‌ నిద్రిస్తున్నాడు. అనిత, రితిక ఇంటికి కొంతదూరంలో చెట్టు కింద కూర్చుకున్నారు. విద్యుదాఘాతంతో ఇంటి ఎదుట పందిరికి మంటలు అంటుకుని ఇంట్లోని టార్పాలిన్లకు వ్యాపించాయి.

నిద్రలో ఉన్న సాయికుమార్‌ గమనించి ‘అమ్మా.. అమ్మా.. మంటలు’అంటూ ఏడుస్తూ అరిచాడు. గమనించిన తల్లి అనిత ఇంటి వద్దకు పరుగు తీసింది. అప్పటికే మంటలు ఎగిసిపడుతున్నాయి. కొడుకును కాపాడుకునేందుకు తల్లి చేసే ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ క్రమంలో ఆమెకూ గాయాలయ్యాయి. మంటలు మరింత వ్యాపించడంతో బాలుడు తన ప్రాణాలు కాపాడుకునేందుకు.. ఇంట్లోని మరోగదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. 

చ‌ద‌వండి: ప్రియుడితో క‌లిసి మ‌రో ప్రియుడి హ‌త్య‌

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి అగ్నిమాప‌క‌ శకటం చేరుకుని, మంటలార్పగా.. అప్పటికే మంటల వేడి తాళలేక, పొగతో ఊపిరి ఆడక బాలుడు మృతి చెందాడు. ఇంట్లోని సామగ్రి కాలిబూడిదైంది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకు కళ్లెదుటే మంటల్లో కాలిపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మానకొండూర్‌ ఇన్‌చార్జి సీఐ స్వామి మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)