Breaking News

కల్వకుర్తి వ్యవసాయ ఏడీ జైలుకు తరలింపు

Published on Sun, 02/22/2026 - 06:04

మహబూబ్‌నగర్‌ క్రైం/నేరేడుచర్ల, గరిడేపల్లి: కల్వకుర్తి వ్యవసాయశాఖ ఏడీ కిరణ్‌కుమార్‌ ఆస్తుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఏసీబీ నుంచి మొత్తం ఏడు బృందాలు వేర్వేరుగా చేసిన సోదాలలో కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించారు. శనివారం కల్వకుర్తిలోని ఆయన కార్యాలయంతో పాటు నివాసంలో సోదాలు నిర్వహించారు. కిరణ్‌కుమార్‌ స్వగ్రామమైన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని పొనుగోడు గ్రామంలో గల ఆయన ఇంట్లో తెల్లవారుజాము నుంచే తనిఖీలు ప్రారంభించారు.

గడ్డిపల్లి గ్రామంలోని కిరణ్‌కుమార్‌ అత్తగారింటి వద్ద, అదేవిధంగా అనంతగిరి మండలం అమీనాబాద్, సూర్యాపేటలోని కిరాయి ఇళ్లలోనూ సోదాలు చేసినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌లో ఏసీబీ డీఎస్పీ సీహెచ్‌ బాలకృష్ణ మాట్లాడుతూ కల్వకుర్తి వ్యవసాయ శాఖ ఏడీ కిరణ్‌కుమార్‌పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా చేసిన తనిఖీల్లో దాదాపు రూ.4 కోట్ల ఆస్తులను మొదటి రోజు గుర్తించినట్లు వెల్లడించారు. దీంట్లో ప్రధానంగా 97 ఎకరాల భూమి, ఓపెన్‌ ప్లాట్లు మూడు, ఐదు కార్లు, ఇన్సూరెన్స్‌ పాలసీలు రూ.5.5 లక్షలు, పలు రకాల పెట్టుబడులు రూ.50 లక్షలు, ఫ్లాట్‌లు రెండు, ఒక ఇళ్లు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.

కిరణ్‌కుమార్‌పై అవినీతి చట్టం 1988 కింద కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచి, ఆ తర్వాత చర్లపల్లి జైలుకు తరలించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగుతుందని అన్ని రకాల వివరాలు సేకరించి ప్రత్యేక నివేదిక అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ శాఖలలో ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్‌ ఫ్రీతో పాటు 9440446106 వాట్సాప్‌కు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)