Breaking News

స్పీకర్‌ నిర్ణయాలపైన్యాయ సమీక్ష జరపొచ్చు

Published on Fri, 08/02/2024 - 06:19

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ స్పీకర్‌ నిర్ణయాలపై న్యాయసమీక్ష జరిపే అధికారం ధర్మాసనాలకు ఉంటుందని సుప్రీంకోర్టు న్యాయవాది ఆర్యామ సుందరం హైకోర్టులో వాదనలు వినిపించారు. స్పీకర్‌ను ట్రిబ్యునల్‌ చైర్మన్‌గా పరిగణించాలని.. స్పీకర్‌కు కాకపోయినా, ట్రిబ్యునల్‌ చైర్మన్‌కు న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేయవచ్చన్నారు. ఇదే విషయాన్ని గతంలో సుప్రీంకోర్టు ఓ కేసు విచారణ సందర్భంగా తేలి్చచెప్పిందని పేర్కొన్నారు.

ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్‌ను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేపీ.వివేకానంద, పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ ఎలీ్పనేత మహేశ్వర్‌రెడ్డి మూడు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి గురువారం మరోసారి విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఏ.సుదర్శన్‌రెడ్డి, పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది గండ్ర మోహన్‌రావు, మాజీ ఏఏజీ రామచంద్రరావు హాజరయ్యారు.

పిటిషనర్ల తరఫున న్యాయవాది ఆర్యామ సుందరం వాదనలు వినిపిస్తూ.. ‘ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి పార్టీ మారడమే కాకుండా పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. ఆయన్ను ప్రజలు ఓడించారు. మహారాష్ట్ర, మణిపూర్‌ కేసులలో సుప్రీంకోర్టు వెలువరించిన రెండు తీర్పులను పరిశీలిస్తే.. తమ ముందు పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లపై నిరీ్ణత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రూల్‌ 6, 7ను ప్రకారం స్పీకర్‌ నడుచుకోవడం లేదు. వెంటనే నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలి. అని విజ్ఞప్తి చేశారు.  

ప్రజాస్వామ్యానికి ముప్పన్న సుప్రీంకోర్టు 
‘పదవ షెడ్యూల్‌ను ఉల్లంఘించిన వ్యక్తులను అనర్హులుగా ప్రకటించాలనే రాజ్యాంగ లక్ష్యానికి కట్టుబడి ఉండాలంటే, ఫిర్యాదు చేసిన తేదీ నుంచి మూడు నెలల వ్యవధిలో స్పీకర్‌ ముందు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలి. సాధారణంగా లోక్‌సభ, శాసనసభల జీవితకాలం ఐదేళ్లు మాత్రమే. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచుకోకుండా సరైన సమయంలో తీర్పు వెలువరించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు తీర్పునిచి్చంది. మెజారిటీ ఉన్న పార్టీ తరఫు వ్యక్తి స్పీకర్‌ అవుతారని, అధికార పారీ్టకి వ్యతిరేకంగా ఆయన నిర్ణయం తీసుకోకుండా పదవీకాలం ముగిసేవరకు పెండింగ్‌లో ఉంచడం సరికాదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

కైశమ్‌ మేఘచంద్రసింగ్‌ వర్సెస్‌ స్పీకర్‌ ఆఫ్‌ మణిపూర్‌.. కేసులో స్పీకర్‌ రాజకీయ విధేయత కారణంగా పక్షపాత వైఖరిని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పుగా పేర్కొంది. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని.. ఒక పార్టీ నుంచి ఎన్నికవుతున్న స్పీకర్‌ వద్ద ఉంచాలా.. వద్దా.. అనేది పార్లమెంట్‌ పునరాలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు సూచించింది’అని ఆర్యామ సుందరం వివరించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఇచి్చన ఆదేశాలను హైకోర్టుకు నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేశారు.

ఎస్సీ, ఎస్టీల్లోని ప్రతి కులానికి రిజర్వేషన్‌ ఫలాలు
సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ జరిగేందుకు మార్గం సుగమమైంది. మూడు దశాబ్దాలుగా ఎమ్మార్పీఎస్‌తో పాటు పలు సంఘాలు తీవ్రస్థాయిలో చేసిన ఉద్యమానికి ఇప్పుడు ఫలితం దక్కింది. ఎస్సీ, ఎస్టీల్లోని ప్రతి కులానికి ఇప్పుడు రిజర్వేషన్‌ ఫలాలు
అందుతాయి. ఇప్పటివరకు రిజర్వేషన్ల అమల్లో స్పష్టత లేకపోవడంతో కొన్ని కులాలు మాత్రమే రిజర్వేషన్ల ఫలాలు దక్కించుకున్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. జనాభా ప్రాతిపదికన అన్ని కులాలకు వర్గీకరణ ద్వారాన్యాయం జరగనుంది.  – వలిగి ప్రభాకర్‌ ఎరుకల, ఆల్‌ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)