మీనాకుమారి పిటిషన్‌పై హైకోర్టు కీలక తీర్పు

Published on Sat, 06/06/2026 - 09:59

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో నమోదైన ‘బాలికలకు వల’ కేసులో నిందితురాలు మీనాకుమారి మేజిస్ట్రేట్ ఎదుట ఒకలా.. ఇక్కడి పిటిషన్‌లో మరోలా విరుద్ధ ప్రకటనలు చేయడం సరికాదని హైకోర్టు హెచ్చరించింది.  రిమాండ్‌ సమయంలో ఎలాంటి వేధింపులు జరగలేదని చెప్పిన ఆమె.. అనంతరం తనను వేధింపులకు గురిచేశారని చెప్పడాన్ని తప్పుబట్టింది. ఆమె కోరిన విధంగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటుగానీ, సీసీటీవీ ఫుటేజీ భద్రపరచాలని ఆదేశించలేమని తేల్చిచెప్పింది. పిటిషన్‌లో కోరిన ఉపశమనాల మంజూరుకు ఎలాంటి కారణాలు కనిపించలేదంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా మైనర్‌ బాలికలను వలలో వేసుకుని, వారితో లైంగిక వాంఛ తీర్చుకోవడంతో పాటు లక్షలో డబ్బు దోచుకున్నారన్న ఆరోపణలపై చంద్రశేఖర్‌ ఆజాద్‌ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 

తర్వాత అతని తల్లి మీనాకుమారితో పాటు మరికొందరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తను పోలీసులు తీవ్ర వేధింపులకు గురిచేశారని, సిట్‌ , సీఐడీ విచారణకు ఆదేశించాలని కోరుతూ నిందితురాలు మీనాకుమారి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పోలీసులు తమ అధికారాలను దుర్వినియోగం  చేసి పిటిషనర్‌ను అక్రమంగా నిర్బంధించారని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ  చట్ట నిబంధనలను ఉల్లంఘించారన్నారు. ఈ ఘటనపై సిట్‌ ఏర్పాటుతో పాటు రూ.50 లక్షల పరిహారం మంజూరు చేయాలని, సంబంధిత పోలీసు స్టేషన్ల సీసీటీవీ ఫుటేజీ, ఫోన్‌ కాల్‌ డేటా, సెల్‌ టవర్‌ లొకేషన్‌ వివరాలను భద్రపరచాలని కోరారు.   

హోం జీపీ మహేశ్‌ రాజే వాదనలు వినిపిస్తూ.. మే 5న రిమాండ్‌ సమయంలో మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరైన పిటిషనర్, పోలీసులు తనను ఎలాంటి వేధింపులకు గురి చేయలేదని పేర్కొన్నారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్‌ చేసిన ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు లేవని, కోర్టు ముందు ఉన్న రికార్డులు ఆమె వాదనలకు విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.   

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)