Breaking News

మహంకాళి బోనాల్లో అపచారం.. ప్రభుత్వంపై భగ్గుమన్న జోగిన శ్యామల

Published on Mon, 08/03/2026 - 12:39

సాక్షి, సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో జోగినులకు తీవ్ర అవమానం జరిగిందని జోగిన శ్యామల ఆరోపించారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న జోగినుల సంప్రదాయాలకు తగిన గౌరవం కల్పించడంలో దేవాదాయ శాఖ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. బోనాల ఉత్సవాల్లో జోగినులకు తగిన గుర్తింపు, మర్యాదలు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా నిన్న జోగినిలకు జరిగిన అవమాన ఘటనపై జోగిన శ్యామల తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా శ్యామల.. బోనాల జాతరలో జోగినుల పాత్ర ఎంతో కీలకమైనదని, అయినప్పటికీ ప్రతి ఏడాది తమకు హామీలు ఇస్తున్న అధికారులు వాటిని అమలు చేయడం లేదని ఆరోపించారు. జోగినుల సంప్రదాయాలను పరిరక్షించాల్సిన బాధ్యత దేవాదాయ శాఖపై ఉన్నప్పటికీ, ఆ బాధ్యతను నిర్వర్తించడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు.

దేవాదాయ శాఖ పరిధిలో జోగినులకు ప్రత్యేక స్థానం, అధికారిక హోదా కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ఆలయ సంప్రదాయాల్లో భాగమైన జోగినుల సేవలకు గుర్తింపు ఇవ్వడంతో పాటు, ఉత్సవాల్లో వారికి గౌరవప్రదమైన స్థానం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాల్లో జరిగిన అపచారాన్ని వెంటనే సరిదిద్దాలని శ్యామల డిమాండ్ చేశారు. జోగినుల గౌరవానికి భంగం కలిగించేలా జరిగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ వెంటనే స్పందించి వివరణ ఇవ్వాలని కోరారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

జరిగిన పరిణామాల నేపథ్యంలో వారం రోజుల్లో తిరిగి అమ్మవారికి బోనం సమర్పించేందుకు సిద్ధమవుతున్నట్లు శ్యామల ప్రకటించారు. సంప్రదాయబద్ధంగా బోనం సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ప్రతి ఏడాది జోగినుల సమస్యలపై చర్చలు జరుగుతున్నప్పటికీ, ఆచరణలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. మాటలు మాత్రమే కాకుండా ప్రభుత్వ స్థాయిలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకుని జోగినుల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు.

 

జోగినుల సంప్రదాయం తెలంగాణ సంస్కృతి, బోనాల ఉత్సవాల్లో విడదీయరాని భాగమని పేర్కొన్న శ్యామల.. ఆ సంప్రదాయాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం, దేవాదాయ శాఖపై ఉందన్నారు. జోగినుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎలాంటి చర్యలు ఉండకూడదని, జరిగిన ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)