Breaking News

ఈ కుబేరుడు పెద్ద ఫ్రాడు!

Published on Sat, 12/27/2025 - 08:34

నిజామాబాద్‌: ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ మహిళ నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. రైల్వేహెడ్‌కానిస్టేబుల్‌ సహకారంతో వారికి కుచ్చుటోపి పెట్టింది. లక్షలాది డబ్బులు చెల్లించిన నిరుద్యోగులు మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆదిలాబాద్‌ జిల్లాకు  చెందిన నిందితురాలు స్వరూప, ఆమెకు సహకరించిన రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ కుబేర్‌ పై నిజామాబాద్‌ నగరంలోని 3వ టౌన్, 4వ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. కరీంనగర్, ఆదిలాబాద్‌ జిల్లాలోనూ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన ఘటనల్లో మహిళపై కేసులు నమోదైనట్లు తెలిసింది.   

శానిటేషన్‌ సిబ్బంది..
నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌లోని శానిటేషన్‌ సిబ్బంది 18 మంది నుంచి స్వరూప రూ. 2 లక్షల  నుంచి రూ. 3 లక్షల వసూలు చేసింది. ఆర్‌అండ్‌బీ శాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నట్లు చెప్పుకున్న మహిళ పోలీస్‌శాఖ క్లూస్‌టీమ్‌లో పనిచేస్తున్న ఇద్దరు, సీసీఎస్‌లో పనిచేస్తున్న ఒక కానిస్టేబుళ్ల నుంచి రూ.8 లక్షల వరకు వసూలు చేసింది. ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా చేపడుతున్న పనుల్లో పర్సంటేజీలు ఇప్పిస్తానంటూ ముందుగా పెట్టుబడి పెట్టాలని చెబుతూ కానిస్టేబుల్‌ నుంచి డబ్బులు వసూలు చేసింది. ఈ వ్యవహారంలో రైల్వేహెడ్‌కానిస్టేబుల్‌ సహకారం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రైల్వేస్టేషన్‌లోని శానిటేషన్‌ సిబ్బంది నుంచి డబ్బుల వసూళ్లలో రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ ముఖ్యపాత్ర పోషించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. స్వరూప హెడ్‌కానిస్టేబుల్‌ను వెంట తీసుకుని వెళ్లేదని, దీంతో తేలికగా డబ్బులు వసూ లు చేసేదని బాధితులు చెబుతున్నారు. శాఖల వా రీగా ఉద్యోగాలు కలి్పస్తామంటూ మహిళ మోసాని కి గురి చేసింది. ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్, జిల్లా పరిషత్‌లో అటెండర్‌ పోస్టుల పేరిట రైల్వే స్టేషన్లో పనిచేస్తున్న శానిటేషన్‌ సిబ్బంది నుంచి రూ.2.50 లక్ష లు వసూలు చేసింది. జిల్లా స్త్రీశిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ పోస్టులకు, ఇతర శాఖలలో జూనియర్‌ అసిస్టెంట్‌ రికార్డ్‌ అసిస్టెంట్‌ పోస్టుల పేరిట నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసింది. 

నిందితుల అరెస్టు 
స్వరూపతోపాటు కుబేర్‌ను అరెస్టు చేసినట్లు మూ డవ టౌన్‌ ఎస్సై హరిబాబు తెలిపారు. వీరిపై 3వ టౌన్‌ స్టేషన్‌లో మూడు కేసులు, 4వ టౌన్‌లో మూడు కేసులు, నిజామాబాద్‌ రూరల్‌లో ఒక కేసు నమోదైనట్లు తెలిపారు.

నకిలీ గుర్తింపు కార్డులు, నియామక పత్రాలు 
నిందితురాలు స్వరూప నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి నకిలీ గుర్తింపు కార్డులు, నకిలీ నియామక పత్రాలను అందజేసింది. ఇందులో జిల్లా కలెక్టర్‌ పేరుతో నకిలీ సంతకాలు ఉన్నట్లు సమాచారం. వీటన్నింటిని పోలీసులు పరిశీలిస్తున్నారు. తన కారుకు ఆర్‌అండ్‌బీ శాఖకు సంబంధించిన నెమ్‌ప్లేట్‌ వేసుకోవడం గమనార్హం.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)