‘పాలమూరు’పై 31న భేటీ

Published on Wed, 07/26/2023 - 03:48

సాక్షి, హైదరాబాద్‌: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల కృష్ణా జలాలు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల అమలును అడ్డుకోవాలంటూ ఏపీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ ఈ నెల 31న ఆ రెండు రాష్ట్రాలతో సమావేశం కానుంది. పోలవరం ద్వారా కృష్ణాకు మళ్లించనున్న 80 టీఎంసీల గోదావరి జలాలకు బదులుగా సాగర్‌ ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకోవడానికి గతంలో బచావత్‌ ట్రిబ్యునల్‌ అనుమతి ఇచ్చింది.

ఇందులో మహారాష్ట్ర, కర్ణాటక వాటాలు పోను మిగిలిన 45 టీఎంసీలతో పాటు మైనర్‌ ఇరిగేషన్‌లో పొదుపు చేసిన 45 టీఎంసీలు కలిసి మొత్తం 90 టీఎంసీలను పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయిస్తూ గతంలో తెలంగాణ జీవో జారీ చేసింది. ఈ జీవోపై ఏపీ చేసిన ఫిర్యాదుపై ఇప్పటికే బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ రెండు రాష్ట్రాల వాదనలు విని విచారణ ముగించింది. తీర్పు వెలువడాల్సి ఉంది.

అయితే ఎగువ రాష్ట్రాలకు కేటాయించిన కృష్ణా జలాల్లో మహారాష్ట్ర, కర్ణాటకల వాటాలు పోగా మిగిలిన 45 టీఎంసీలపై ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి హక్కు ఉందని, తెలంగాణ ఆ నీళ్లను వినియోగించుకోవాలంటే విధిగా ఏపీతో ఒప్పందం చేసుకోవాల్సిందేనని ఇటీవల కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తేల్చి చెప్పింది. ఈ మేరకు తెలంగాణకు లేఖ రాసింది.

అయితే సాగర్‌ ఎగువన తెలంగాణలోనే కృష్ణా బేసిన్‌ ఉందని, అందువల్ల 45 టీఎంసీలు తమకే దక్కుతాయని తెలంగాణ వాదిస్తోంది. పోలవరం ప్రాజెక్టు ఏపీలో ఉందని, దాని ద్వారా తరలించనున్న 80 టీఎంసీలతో ఏపీలోని కృష్ణా డెల్టాకు ప్రయోజనం కలగనుందని, ఇందుకు బదులుగా కేటాయించిన కృష్ణా జలాల్లో తెలంగాణకు మాత్రమే హక్కు ఉంటుందని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి సమావేశాన్ని తలపెట్టడం ఆసక్తికరంగా మారింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)