Breaking News

ప్రాణం తీసిన ప్రేమ పంచాయితీ!

Published on Fri, 07/18/2025 - 07:57

క్రైమ్‌: జగిత్యాల జిల్లా వెల్గటూర్‌ మండల కేంద్రంలో పట్టపగలు యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. ప్రేమ వ్యవహారం కారణంగానే ఈ హత్య జరిగినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. 

మండలంలోని కిషన్‌రావుపేట గ్రామానికి చెందిన చల్లూరి మల్లేశ్‌ (30) కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన ఒక యువతితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. ఈ విషయంలో యువతి బంధువులు అనేకసార్లు మల్లేశ్‌కు నచ్చజెప్పారు. రెండు కుటుంబాల మధ్య గొడవలు, కొట్లాటలు జరిగాయి. ఈ క్రమంలో మల్లేశ్‌ జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అతనిపై రౌడీషీట్‌ కూడా నమోదైంది. అయినప్పటికీ మల్లేశ్‌ ప్రవర్తనలో మార్పు రాలేదు. మల్లేశ్‌ గతంలో హార్వెస్టర్‌ నడిపించగా.. ఈ గొడవల నేపథ్యంలో హార్వెస్టర్‌ అమ్మేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. 

గురువారం ఉదయం కూడా మల్లేశ్‌ సదరు యువతి ఇంటికి వెళ్లి గొడవ చేసినట్లు సమాచారం. యువతి తండ్రికి ఫోన్‌ చేసి దుర్భాషలాడినట్లు తెలిసింది. ఈ క్రమంలో యువతి బంధువులు విసిగిపోయారు. ఇంటి నుంచి ద్విచక్రవానంపై బయలుదేరిన యువకుడిని వెంబడించి వెల్గటూర్‌ మండల కేంద్రంలోని పెద్దవాగుపై విచక్షణారహితంగా కొట్టి ఆటోలో తీసుకెళ్లి కోటిలింగాల రోడ్డులోని పాత వైన్స్‌ వెనకాల కత్తులతో పొడిచి చంపినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుడి తల్లిదండ్రులకు నలుగురు కూతుళ్లుకాగా మల్లేశ్‌ ఒక్కడే కుమారుడు.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)