Breaking News

బర్త్‌డే గిఫ్ట్‌గా యూరియా బస్తాలు.. ఎక్కడో తెలుసా?

Published on Wed, 08/20/2025 - 13:45

యూరియా కష్టాలపై తెలంగాణవ్యాప్తంగా తీవ్రచర్చ నడుస్తున్న వేళ.. జగిత్యాల జిల్లాలో జరిగిన ఓ ఘటన చర్చనీయాంశమైంది. పుట్టినరోజు జరుపుకున్న ఓ రైతుకు తోటి స్నేహితులు యూరియా బస్తా కానుకగా ఇచ్చారు. పైగా ఇప్పుడు ఇదే ట్రెండ్‌గా మారిందనే చర్చా నడుస్తోంది.

కథలాపూర్ మండలం తాండ్రియాలలో ముక్కెర మధు అనే రైతు పుట్టినరోజు నాడు.. అతని స్నేహితులు యూరియా బస్తాను బహుకరించారు. రైతులు యూరియా కోసం పడుతున్న కష్టాలను చూసి ఇచ్చామంటున్నారు. ఈ తరుణంలో.. ప్రభుత్వంపై సెటైర్ గా సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ అవుతోంది.

మొన్నీమధ్యే.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం శత్రాజుపల్లి గ్రామంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. కిషన్ రెడ్డి అనే రైతు పుట్టినరోజు సందర్భంగా యూరియా బస్తాను బహుమతిగా ఇచ్చారు ఆయన మిత్రులు.

పలు జిల్లాల్లో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. క్యూ లైన్‌లలో పడిగాపులు పడలేక చెప్పులను ఉంచుతున్న దృశ్యాలు వెలుగులోకి రావడం చూశాం. అందుకే యూరియా కోసం ప్రభుత్వాన్ని బతిమాలడం చూస్తున్నాం. పంటలకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచడంలో వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికలు లేకపోవడం మూలంగా ఏర్పడిందని పలు గ్రామాల్లో రైతులు వాపోతున్నారు.

అయితే విమర్శల వేళ రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్‌ స్పందించారు. రైతులకు ఎరువులు అందించడంలో కేంద్రం విఫలమైంది. సరిపడా యూరియాను అందించలేకపోయింది. ఢిల్లీలో కాంగ్రెస్‌ ఎంపీలు యూరియా కోసం పోరాడుతున్నారు. ఈ నెలాఖరుకల్లా యూరియా బస్తాలు వస్తాయి అని ఆశాభావం వ్యక్తం చేశారాయన. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)