Breaking News

మన చిత్రం.. జగమెరిగిన సత్యం

Published on Fri, 04/18/2025 - 12:03

సినిమా అంటే ఒక క్రేజ్‌.. రంగులతో కనిపించే సినిమా చాలామందికి కల.. ఇలాంటి ఓ సినిమా మన ప్రాంతంలో రూపుదిద్దుకుంటే ఆ ఆనందం వేరు. ఎలాంటి ప్రాచుర్యానికి నోచుకోని ఆ గ్రామంలోని వెనుకబడిన     పరిస్థితులు, గ్రామస్తుల సహజ అమాయకత్వం ఈనేపథ్యంలో చింతలమానెపల్లి మండలంలోని దిందా గ్రామ కేంద్రంగా రూపుదిద్దుకున్న చిత్రం.. జగమెరిగిన సత్యం..ఈనెల 18న సినిమా విడుదల కానుంది.

 

చింతలమానెపల్లి: మండలంలోని దిందా.. ఒక మారుమూల గ్రామం.. త్వరలో రంగస్థలానికి పరిచయమవుతోంది. దట్టమైన అటవీ ప్రాంతంలో రవాణా సౌకర్యాలకు, గ్రామం అభివృద్ధికి నోచుకోకుండా ఉంది. జగమెరిగిన సత్యం టైటిల్‌తో విడుదల అవుతున్న చిత్రం 80 శాతం గ్రామంలోనే చిత్రీకరించారు. గ్రామ సమీపంలోని వాగు, చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్‌ వారసంత, గూడెం ప్రాణహిత నది వంతెన, పెంచికల్‌పేట్‌ పెద్దవాగు, కౌటాల మండల కేంద్రం, పక్కనే మహారాష్ట్రలోని అహేరి వద్ద కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు. కౌటాల ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో మొదటి సన్నివేశం చిత్రీకరణతో సినిమా ప్రారంభించారు.

1994లో గ్రామీణ పరిస్థితుల నేపథ్యం..
1994లోని గ్రామీణ నేపథ్యం, అప్పటి మనుషుల కట్టుబాట్లు, దర్శకుడి చిన్నతనంలోని అనుభవాలను ఆధారంగా చిత్రం రూపొందింది. ప్రేమ సన్నివేశాలు, భావోద్వేగాలు, సంస్కృతి, సంగీతం ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకుడు పాలె తిరుపతి తెలిపారు. ఇందులో పలు సన్నివేశాల్లో దిందా గ్రామస్తులను బ్యాక్‌గ్రౌండ్‌లో నటించేందుకు అవకాశం కల్పించారు. సినిమాలో ఐదు పాటలు ఉండగా బతుకమ్మ పాటను గాయకురాలు మంగ్లీ ఆలపించారు. రాణా దగ్గుబాటి, సాయిపల్లవి నటించిన విరాట పర్వం చిత్రానికి పనిచేసిన సురేష్‌ బొబ్బిలి ఈచిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. హీరో రవితేజ మేనల్లుడు అవినాష్‌వర్మ, ఆద్యారెడ్డిలను హీరో, హీరోయిన్లుగా తొలిపరిచయం చేశామని, మరో హీరోయిన్‌గా నీలిమ పతకంశెట్టి నటించినట్లు దర్శకుడు తెలిపారు.

జిల్లాలో ఆలస్యంగా విడుదల
జగమెరిగిన సత్యం సినిమా కుమురం భీం జిల్లాలో కాస్త ఆలస్యంగా విడుదల కానుంది. ఈనెల 18 (శుక్రవారం)న మంచిర్యాలలో, తెలంగాణలో 33 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. కాగజ్‌నగర్‌లో ఇతర సినిమాలకు ముందుగానే షెడ్యూల్‌ ఖరారు అయి ఉండడంతో కొన్నిరోజుల అనంతరం విడుదల అవుతుందని సినిమా బృందం తెలిపింది.

దర్శకుడు స్థానికుడే..
దర్శకుడు పాలె తిరుపతి స్వగ్రామం పెంచికల్‌పేట్‌ మండలం చెడ్వాయి. ఆయనకు చింతలమానెపల్లి మండలంలో బంధువులు ఉండగా వారి ఇంటికి వచ్చేక్రమంలో స్థానిక గ్రామాలపై పరిచయం ఉండగా సినిమా చిత్రీకరణకు కారణమైంది. గ్రామంలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన ఆయన మంచిర్యాలలో డిగ్రీ పూర్తిచేశారు. సినిమాలపై ఆసక్తితో చిత్రరంగానికి వెళ్లి దర్శకత్వ శాఖలో 8 ఏళ్లు పనిచేశారు. ఈక్రమంలో ‘కొరియన్‌ శీర్షిక అహేరి’పేరుతో లఘుచిత్రం రూపొందించారు. అది సాధించిన విజయం ఇచ్చిన స్ఫూర్తితో మరో నాలుగు లఘు చిత్రాలను రూపొందించగా, ఈ అనుభవంతో జగమెరిగిన సత్యం చిత్రాన్ని తెరకెక్కించారు. కథానాయకుడికి చిన్నతనంలో సోదరుడిగా చింతలమానెపల్లి మండలం గంగాపూర్‌కు చెందిన దంద్రె మణికంఠ(బబ్లూ) బాలనటుడిగా 
నటించాడు.

గర్వంగా భావిస్తున్నాం
దిందా గ్రామం పేరు వెండితెరపై వినిపించడం పట్ల మేము గర్వంగా భావిస్తున్నాం. స్థానికంగా చిత్రీకరణ జరగడంతో కొంతమందికి ఉపాధి లభించింది. అటవీ ప్రాంతంలో ఉండే మా గ్రామం అభివృద్ధిలో వెనుకబడి ఉంది. సినిమాతో గ్రామానికి ప్రచారం లభించడం మేము సంతోషంగా ఉన్నాం.
– డోకె రామన్న, దిందా

సహకారం అందించాం
సినిమా చిత్రీకరణకు అనువైన ప్రదేశాల కోసం సోదరుడు అయిన డైరెక్టర్‌ నన్ను సంప్రదించారు. ఎన్నో ప్రాంతాలను పరిశీలించి దిందా గ్రామాన్ని ఎంపిక చేసుకున్నాం. సినిమా చిత్రీకరణ పూర్తయ్యే వరకు సినిమా బృందానికి నాతో కలిసి గ్రామస్తులు, స్థానిక ప్రజలు సహకారాలు అందించాం. సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాం.
– దేవాడి రాజన్న, గంగాపూర్‌

బాలనటుడిగా మరిచిపోలేనిది
సినిమాలో నటించే అవకాశం రావడం ఒక వరం లాంటిది. నేను 8వ తరగతి చదువుకునే సమయంలో దగ్గరి బంధువు అయిన సినిమా దర్శకుడు అవకాశం కల్పించారు. నటనలో అనుభవం లేకున్నా దర్శకుడు, నటుల సహకారంతో బాలనటుడిగా నటించాను. ఈ అనుభవం మరిచిపోలేనిది.
– దంద్రె మణికంఠ(బబ్లూ), గంగాపూర్‌  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)