Breaking News

అధ్యక్షుడి కోసం.. నిరీక్షణ తప్పదా?

Published on Wed, 04/30/2025 - 05:05

సాక్షి, హైదరాబాద్‌:  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు ఇంకా కొన్నిరోజులు సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ అధ్యక్షుడితో పాటు ఏపీ తదితర రాష్ట్రాల అధ్యక్షులు అలాగే, జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరగాల్సి ఉండగా..ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. తాజాగా కశ్మీర్‌లో ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. పహల్గాంలో 28 మంది పర్యాటకులు చనిపోవడం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని.. పాలనా పరంగా, రాజకీయంగానూ కుదిపేసింది.

ప్రభుత్వంలో, పార్టీలో కీలకమైన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పూర్తిగా..పహల్గాం ఉగ్రదాడి తదనంతరం పరిణామాలపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో పార్టీ సంస్థాగత అంశాలు, రాజకీయపరమైన విషయాలను ఇప్పట్లో పట్టించుకునే అవకాశం లేదని, కొత్త జాతీయ అధ్యక్షుడి విషయంలో మరి కొంతకాలం వేచిచూడక తప్పదని బీజేపీ నేతలు అంటున్నారు. జాతీయ అధ్యక్షుడి ఎన్నికతో తెలంగాణ అధ్యక్షుడి ఎన్నిక కూడా ముడిపడి ఉన్నందున, రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక కూడా ఆలస్యం అవుతుందని చెబుతున్నారు.  

కొత్త అధ్యక్షుడికి అన్నీ సవాళ్లే..! 
రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరు నియమితులైనా సంస్థాగతంగా, రాజకీయంగానూ కొన్ని సమస్యలను ఎదుర్కోక తప్పదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతోంది. ఈ బాధ్యతలు చేపట్టగానే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో ఎన్నికల ప్రక్రియపైనే పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుందని అంటున్నారు. పార్టీలో గ్రూపులు పెరగడంతో.. సొంత ముద్రతో క్యాడర్‌ను తమ వైపు తిప్పుకోవడమూ సవాళ్ళతో కూడుకున్నదేననే చెబుతున్నారు. 

మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల కల్లా (2028) పార్టీని సంస్థాగతంగా, రాజకీయంగా బలోపేతం చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ అగ్ర నాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించడం ద్వారా పార్టీ బలాన్ని చాటడం కొత్త అధ్యక్షుడికి పెద్ద సవాల్‌గానే నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

కేడర్‌లో నిరాసక్తత! 
రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరగకపోవడం, పార్టీ కార్యక్రమాలు పెద్దగా లేకపోవడంతో.. పైకి బాగానే కనిపిస్తున్నా కేడర్‌లో లోలోపల నిరాసక్తత, నిర్లిప్తత చోటు చేసుకుందని అంటున్నారు. నిరుద్యోగ యువత, మహిళలు, రైతులు ఇతర వర్గాల సమస్యలపై అడపాదడపా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేలా పెద్దగా కార్యాచరణ ఏదీ లేదని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 

8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. రాజకీయ కార్యకలాపాలు జోరుగా సాగడం లేదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు ఎవరికి వారు తమ సొంత ఇమేజీని పెంచుకోవడంపైనే దృష్టి పెడుతున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి.    

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)