Breaking News

జన్వాడ ఫాంహౌస్‌పై హైడ్రా నజర్‌

Published on Tue, 08/27/2024 - 16:53

సాక్షి, హైదరాబాద్‌: జన్వాడ ఫాంహౌస్‌ను ఇరిగేషన్‌ అధికారులు పరిశీలించారు. చట్టవిరుద్ధంగా ఫాంహౌస్‌ నిర్మాణం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఫాంహౌస్‌లో  కొలతలు వేసిన అధికారులు.. సర్వేను పూర్తి చేశారు.

ఇప్పటికే బద్వేల్‌ ప్రదీప్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, జన్వాడ ఫామ్‌హౌజ్‌ కూల్చివేత కేసులో హైదరాబాద్‌ డిజాస్టర్‌మేనేజ్‌మెంట్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ (హైడ్రా)కు తెలంగాణ హైకోర్టు  కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. జన్వాడ ఫామ్‌హౌజ్‌ కూల్చివేయకుండా హైడ్రాను ఆదేశించాలంటూ వేసిన పిటిషన్‌ను గత బుధవారం(ఆగస్టు21) హైకోర్టు విచారించింది.

ఫామ్‌హౌజ్‌ కూల్చివేతలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని హైడ్రాను కోర్టు ఆదేశించింది. జీవో 99 ప్రకారమే కూల్చివేతలు చేపట్టాలని కోరింది. ఫామ్‌హౌజ్‌ కూల్చివేయకుండా స్టే ఇవ్వాలన్న పిటిషన్‌ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. కూల్చివేతకు ముందు ఫామ్‌హౌజ్‌కు సంబంధించిన అనుమతి పత్రాలను పూర్తిగా పరిశీలించాలని హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు సూచించింది.

జన్వాడ ఫామ్‌హౌజ్‌ వ్యవహారం కోర్టుకి ఎక్కిన వేళ.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా స్పందించారు. ఆ ఫామ్‌ హౌజ్‌ తనది కాదని, నిబంధనలకు విరుద్ధంగా అది కట్టి ఉంటే తాను కూల్చివేయిస్తానని అన్నారాయన. ‘‘నా పేరుతో ఏ ఫాంహౌజ్‌ లేదు. నా ఫ్రెండ్‌ ఫాంహౌజ్‌ లీజ్‌కు మాత్రమే తీసుకున్నా. ఫాంహౌజ్‌ ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఉంటే నేనే కూలగొట్టిస్తా’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

 

 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)