డీకే అరుణ ఇంట్లోకి ఆగంతకుడు

Published on Mon, 03/17/2025 - 05:32

సాక్షి, హైదరాబాద్‌/ బంజారాహిల్స్‌/పాలమూరు: బీజేపీ మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ నివాసంలోకి ఆదివారం తెల్లవారుజామున ఆగంతకుడు చొరబడిన ఘటన కలకలం సృష్టించింది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌–56లోని డీకే అరుణ ఇంట్లోకి తెల్లవారుజామున 3.50 గంటల సమయంలో కిచెన్‌ వైపు ఉన్న కిటికీ గ్రిల్స్‌ తొలగించి దుండగుడు లోపలికి ప్రవేశించాడు. చేతులకు గ్లౌజ్‌లు, ముఖానికి మాస్క్‌ వేసుకుని లోపలికి వెళ్లగానే హాల్‌లో ఉన్న సీసీ కెమెరాల వైర్‌ను కట్‌ చేశాడు. అరుణ బెడ్‌రూమ్‌ వరకు వెళ్లి అక్కడ కూడా సీసీ కెమెరా వైర్‌ను కట్‌ చేశాడు.

గంటన్నర పాటు ఇల్లంతా కలియదిరిగాడు. ఆ సమయంలో డీకే అరుణ మహబూబ్‌నగర్‌లో ఉన్నారు. ఇంట్లో ఆమె కూతురుతో పాటు పని మనుషులు మాత్రమే ఉన్నారు. దుండగుడు ఓ బెడ్‌రూమ్‌లోకి ప్రవేశించి కొన్ని సామాన్లు కూడా మూటగట్టాడు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ ఘటనపై డీకే అరుణ డ్రైవర్‌ లక్ష్మణ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గతంలో డీకే అరుణ ఇంట్లో పనిచేసి మానేసిన వ్యక్తిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో వస్తువులేమీ పోలేదని డ్రైవర్‌ లక్ష్మణ్‌ తన ఫిర్యాదులో తెలిపాడు.

డీకే అరుణ ఇంట్లో ఆగంతకుడు 

ఈ ఘటనపై డీకే అరుణ ఆందోళన వ్యక్తంచేశారు. మహబూబ్‌నగర్‌లోని తన నివాసంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..జాతీయ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న తన ఇంట్లోనే ఆగంతకుడు చొరబడితే.. రాష్ట్రంలో భద్రత ఎక్కడ ఉందని ప్రశ్నించారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్‌గా దృష్టిసారించి సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ డీకే అరుణకు ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

#

Tags : 1

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)