Breaking News

హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక.. ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

Published on Mon, 11/04/2024 - 07:40

మేడ్చల్‌రూరల్‌: తనకు ఇష్టం లేకపోయినా హాస్టల్‌లో ఉంచి చదివిస్తున్నారని మనస్తానికి గురైన ఇంటరీ్మడియెట్‌ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్‌ పట్టణంలో చోటుచేసుకుంది. మేడ్చల్‌ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం..  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం  విశాఖపట్టణానికి చెందిన కోట్ల అవినాష్‌ (16)ను తల్లిదండ్రులు నగరంలోని కొంపల్లిలోని ఓ హాస్టల్‌లో ఉంచి పేట్‌ బషీరాబాద్‌లోని సెయింట్‌ ఆంటోని కళాశాలలో ఇంటర్మీడియెట్‌ చదివిస్తున్నారు. 

సెలవు రోజుల్లో అవినాష్‌ మేడ్చల్‌ పట్టణంలోని కేఎల్‌ఆర్‌ కాలనీలో నివాసం ఉండే అక్క, బావ ఇంటికి వచ్చేవాడు. ఈ నేపథ్యంలో హాస్టల్‌లో ఉంటూ సదరు కళాశాలలో చదవడం తనకు ఇష్టం లేదని, తాను డే స్కాలర్స్‌గా చదువుకుంటానని అవినాష్‌ తల్లిదండ్రులకు చెప్పినా వారు కుమారుడి ఆవేదనను పట్టించుకునేవారు కాదు.  ఇంటర్‌ పూర్తయ్యే వరకు హాస్టల్‌లో కొనసాగాలని తల్లిదండ్రులు సర్ది చెప్పేవారు. 

దీంతో మనస్తాపం చెందిన అవినాష్‌ ఇటీవల దీపావళి సెలవుల్లో మేడ్చల్‌లోని సోదరి ఇంటికి  వచ్చాడు. శనివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న మేడ్చల్‌పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)