Breaking News

కడెం.. జనం గుండెల్లో సైరన్‌!

Published on Sun, 07/23/2023 - 03:50

కడెం: నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టు దిగువన గ్రామాల ప్రజల గుండెల్లో సైరన్‌ మోగుతోంది. ఓ వైపు వరుస వానలతో వరద పోటెత్తుతుండటం, మరోవైపు ప్రాజె­క్టు గేట్లు మరమ్మతులకు గురై నీటిని సరిగా విడుదల చేయలేని పరిస్థితి తలెత్తడంపై ఆందోళన మరింతగా పెరుగుతోంది. శనివారం కూడా ప్రాజెక్టుకు గణనీయ స్థాయిలో ప్రవాహం కొనసాగింది. ఇలాంటిది అకస్మా­త్తుగా భారీ వరద వస్తే ప్రాజెక్టు తట్టుకుంటుందా? అన్న భయం కనిపిస్తోంది.

మరమ్మతులు చేపట్టేదెప్పుడు?
గతేడాది జూలైలో వచ్చిన వరదతో కడెం ప్రాజెక్టు తెగిపోయే పరిస్థితి ఏర్పడింది. 2, 3 నంబర్‌ గేట్ల కౌంటర్‌ వెయిట్‌లు కొట్టుకుపో­యా­యి. రక్షణ గోడలు, స్పిల్‌ వే, వరద గేటు మోటార్లు దెబ్బతిన్నాయి. కానీ పూర్తి­స్థా­యి మరమ్మతులకు సరిపడా నిధు­లు కే­టా­యించకపోవడం, అదీ సకాలంలో విడు­ద­ల చేయకపోవడంతో ఇటీవలి వరకు మర­మ్మతుల పనులు ప్రారంభమే కాలేదు. ప్రా­జెక్టు దెబ్బతిన్న పదినెలల తర్వాత అంటే మే నెలలో రూ.1.44 కోట్లను మరమ్మతుల కో­సం మంజూరు చేశారు. రెండుసార్లు టెండ­ర్లు నిర్వహించారు. టెండర్‌ పూర్తయ్యే స­మ­యానికి వానాకాలం మొదలవడంతో ప­ను­­లు చేపట్టలేదని అధికారులు తెలిపారు.
 
అరకొర నిర్వహణతో..
ఏటా ప్రాజెక్టు గ్రీసింగ్, జనరేటర్‌ నిర్వహణ, చిన్నస్థాయి మరమ్మతుల కోసం ప్రభుత్వం ఏటా రూ.8 లక్షలు కేటాయిస్తుంది. అవి పైపై పనులకే సరిపోతాయి. అయితే 2018లో ప్రాజెక్టుకు కేటాయించిన 5 కోట్ల నిధుల్లో మిగిలిన మొత్తంతో అధికారులు గేట్ల కౌంటర్‌ వెయిట్‌లను తయారు చేయిస్తున్నారు. ఇక వానాకాలం మొదలయ్యే ముందే వరద గేట్లు సరిగా పనిచేస్తున్నాయా, లేదా అని ట్రయల్‌ రన్‌ చేసి పరిశీలించాలి.

కానీ అధికారులు ఏదో ఒక గేటును పరిశీలించి తూతూమంత్రంగా ప్రక్రియ ముగిస్తున్నారు. అసలు సమయానికి లోపాలు బయటపడితే.. సాంకేతిక కారణాలు అని చెప్తున్నారన్న విమర్శలున్నాయి. ఇక కనీసం ప్రాజెక్టు గేట్ల వద్ద తేనెతుట్టెలనూ తొలగించలేదు. శుక్రవారం వరద పోటెత్తినప్పుడు గేట్లు ఎత్తడానికి వెళ్లిన సిబ్బందిపై తేనెటీగలు దాడి చేయడంతో గాయపడ్డారు. తేనెతుట్టెల కారణంగా  18వ నంబర్‌ గేటును ఎత్తడం లేదని సమాచారం.

ఏడాదిగా నిర్లక్ష్యమే..
కడెం ప్రాజెక్టు మరమ్మతులను ఏడాదైనా పూర్తి చేయించకపోవడం దురదృష్టకరం. స్థానిక ఎమ్మెల్యే, నీటి పారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ప్రాజెక్టు అధ్వానంగా మారింది. ఇప్పటికైనా వేగంగా మరమ్మతులు చేయించాలి. – అలెగ్జాండర్, ఎంపీపీ, కడెం

ప్రాజెక్టుకు ముప్పు లేదు
ప్రాజెక్టులో టెక్నికల్‌ ప్రాబ్లంతో కొన్ని గేట్లు మొరాయించాయి. మెకానికల్‌ సిబ్బందితో గేట్ల మోటార్లకు మరమ్మతు చేయిస్తున్నాం. ప్రాజెక్టుకు ఎలాంటి ముప్పు లేదు. ప్రజలు ఆందోళన చెందవద్దు. – శ్రీనివాస్, ప్రాజెక్టు సీఈ

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)