Breaking News

ఈనెల 13 నుంచి 24 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

Published on Mon, 11/02/2026 - 04:52

సాక్షి, హైదరాబాద్‌: భారత సైన్యంలో అగ్నివీరుల నియామకానికి సంబంధించి ఈనెల 13 నుంచి 24 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించనున్నారు. గచి్చబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్‌ స్టేడియంలో ఈ ర్యాలీ జరగనుంది. తెలంగాణలోని మొత్తం 33 జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఈ ఎంపిక ప్రక్రియలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, అగ్నివీర్‌ టెక్నికల్, అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌ (10వ తరగతి ఉత్తీర్ణత), అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌ (8వ తరగతి ఉత్తీర్ణత) విభాగాల్లో అభ్యర్థులను పరీక్షించనున్నారు.

2027 నియామక సంవత్సరానికి సంబంధించిన ర్యాలీ నోటిఫికేషన్‌ ప్రకారం అడ్మిట్‌ కార్డులు పొందిన అభ్యర్థులు తమ ఒరిజినల్‌ ధ్రువపత్రాలన్నింటినీ వెంట తీసుకురావాలని ఆర్మీ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. ఆర్మీ నియామక ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరుగుతుందని స్పష్టం చేశారు.

ఉద్యోగం ఇప్పిస్తామని, ఎంపిక చేయిస్తామని చెప్పే దళారులు, మోసగాళ్ల మాటలు నమ్మొద్దని హెచ్చరించారు. నియామక ప్రక్రియలో ఏజెంట్లు, మధ్యవర్తుల ప్రమేయం ఉండదన్నారు. నియామకాలకు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం సికింద్రాబాద్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయాన్ని 040–27740059 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు  www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని తెలిపారు. 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)