Breaking News

పని భారం.. ఏఐతో దూరం!

Published on Mon, 06/08/2026 - 05:51

2025 నవంబర్‌–2026 జనవరి మధ్య కాలంలో యూఎస్‌ఏ, యూకే, జర్మనీ ఆస్ట్రేలియాల్లో ఎన్‌బీఈఆర్‌ నిర్వహించిన అధ్యయనం ఆధారంగా ‘ఫర్మ్‌ డేటా ఆన్‌ ఏఐ’ నివేదికను విడుదల చేసింది. ఈ దేశాల్లోని వివిధ రంగాలకు చెందిన 6 వేల మంది సీనియర్‌ బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఈ సర్వేలో పాల్గొన్నారు. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ అట్లాంటా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్, జర్మన్‌ బుందెస్‌ బ్యాంక్, ఆస్ట్రేలియాలోని మాక్వారీ యూనివర్సిటీ ³రిశోధక బృందాలు సంయుక్తంగా ఈ డేటాను సేకరించాయి.

సాక్షి, హైదరాబాద్‌: కృత్రిమ మేధ (ఏఐ) అనేది ఓ సాధారణ ఉద్యోగి రోజువారీ పనిభారాన్ని 2 గంటలు లేదా అంతకంటే ఎక్కువ తగ్గించగలదు. పునరావృతమయ్యే పనులను స్వయంచాలకం చేయడం, సమాచారాన్ని సంగ్రహించడం, భావ ప్రసా­రాన్ని క్రమబద్ధీకరించడం ద్వారా ఆధునిక ఏఐ సాధనాలు ఉద్యోగు­లకు విలువైన సమయాన్ని ఆదా చేస్తున్నాయి. నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ (ఎన్‌బీఈఆర్‌) వంటి సంస్థల వాస్తవ–ప్రపంచ ప్రభావ అధ్యయనాలను బట్టి చూస్తే.. పని సంక్లిష్టతను బట్టి 14% జనరేటివ్, 30% ఏఐ సహాయకాలు ఉద్యోగుల ఉత్పాదకతను పెంచగలవని నిరూపితమవుతోంది.  

ఏమిటీ అధ్యయనం ?
ఏయే రంగాలు ఏఐని ఎక్కువగా వినియోగిస్తున్నాయి. ఏ రంగాలపై దీని ప్రభావం ఎక్కువ పడనుందో వంటి వివరాలు పొందుపరిచింది. ఆ నివేదిక ప్రకారం వివిధ రంగాలపై ఏఐ ప్రభావం, వినియోగ విధానం ఎలా ఉందంటే...

సమాచార, కమ్యూనికేషన్ల రంగం: సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, డేటా అనలిటిక్స్, ఐటీ సర్వీసెస్‌ కంపెనీలు ఏఐని అత్యధికంగా వాడుతున్నాయి
అడ్మినిస్ట్రేటివ్, సపోర్ట్‌ సర్వీసెస్‌ : ఆఫీస్‌ మేనేజ్‌మెంట్, డాక్యుమెంటేషన్, కస్టమర్‌ సపోర్ట్, డేటా ఎంట్రీ వంటి పనులలో ఏఐ వాడకం చాలా ఎక్కువగా ఉంది
హోల్‌సేల్, రిటైల్‌ వ్యాపారం, ఫుడ్‌ సర్వీసెస్, హోటళ్లు, క్యాటరింగ్‌ రంగాలు
 చిన్న కంపెనీలతో పోలిస్తే పెద్ద కార్పొరేట్‌ సంస్థలు ఏఐ టూల్స్‌ను వేగంగా స్వీకరిస్తున్నాయి

అధిక జీతాలు ఇచ్చే కంపెనీలు : ఉద్యోగులకు మంచి వేతనాలు ఇచ్చే ఉన్నత స్థాయి సంస్థలలో ఏఐ ప్రయోగాలు, దాని ద్వారా వచ్చే ఉత్పాదకత లాభాలు ఎక్కువగా ఉన్నట్టు ఈ అధ్యయనం తేల్చిందిమొత్తంగా చూస్తే, శారీరక శ్రమ లేదా సాధారణ క్లరికల్‌ పనులు ఎక్కువగా ఉండే రంగాల కంటే, సమాచార విశ్లేషణ, కమ్యూనికేషన్, ఆఫీస్‌ అడ్మినిస్ట్రేషన్‌ రంగాల్లోనే ప్రస్తుతం ఏఐ విప్లవం వేగంగా విస్తరిస్తోంది.

భారత్‌లో ఏఏ రంగాల్లో  ఏఐ ప్రభావం అధికం ?
ఐటీ మరియు టెక్నాలజీ సర్వీసెస్‌ : సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌లో ఏఐ ఆటోమేషన్‌ వల్ల 10% నుంచి 20% వరకు ఉత్పాదకత పెరిగింది
బ్యాంకింగ్, ఫైనాన్స్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ) : లోన్‌ ప్రాసెసింగ్, రిస్క్‌ అసెస్‌మెంట్, కస్టమర్‌ సపోర్ట్‌ (ఏఐ చాట్‌బాట్స్‌) విభాగాల్లో పనిభారం భారీగా తగ్గింది
రిటైల్, ఈ–కామర్స్‌ (రిటైల్,కన్జూమర్‌ గూడ్స్‌) : కస్టమర్ల అవసరాలను అంచనా వేయడానికి, సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌ కోసం ఏఐని ఎక్కువగా వాడుతున్నారు
ఉద్యోగాల మార్కెట్‌–భవిష్యత్‌ (2026 – 2031): ఏఐ ఉద్యోగాలకు భారీ డిమాండ్‌. నాస్కామ్‌ నివేదికల ప్రకారం ఇండియాలో ఏఐ సంబంధిత ఉద్యోగాల డిమాండ్‌ 
10 లక్షలు దాటింది

 ప్రపంచంలోనే ఏఐ టాలెంట్‌ను ఆకర్షించడంలో భారత్‌ (33% హైరింగ్‌ రేటుతో) ముందుంది
నీతి ఆయోగ్‌ అంచనా : భారత్‌లో వ్యూహాత్మకంగా అడుగులు వేసి ఉద్యోగులకు ఏఐ శిక్షణ ఇస్తే, టెక్, కస్టమర్‌ సర్వీస్‌ రంగాల్లో ఉద్యోగాల సంఖ్య రాబోయే రోజుల్లో కోటి దాటే అవకాశముంది. 
  ఒకవేళ కంపెనీలు అప్‌గ్రేడ్‌ అవ్వకపోతే ఉద్యోగాల కోత తప్పదని ఈ నివేదిక హెచ్చరించింది

భారత్‌ మెరుగైన స్థితిలోనే...
ఇండియాలో ఏఐ వినియోగం..దాని వల్ల పెరుగుతున్న ఉత్పాదకత, ఉద్యోగాలపై ప్రభావం గురించి నాస్కామ్, ఈవై, నీతి ఆయోగ్‌ వంటి సంస్థల నివేదికలు కీలక వివరాలను వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా ఏఐని వేగంగా స్వీకరిస్తున్న దేశాల్లో మనదేశం అగ్రస్థానంలో ఉంది. మనదేశంలో ఏఐ కేవలం ఒక ప్రయోగంలా కాకుండా, ఆర్థిక వ్యవస్థ, ఉత్పాదకతను పెంచే ఒక కీలక శక్తిగా మారుతోందని ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఏఐ అడ్వాంటేజ్, ఉత్పాదకత సమయం ఆదాలో టాప్‌
‘ఈవై 2025 వర్క్‌ రీఇమేజిన్డ్‌’ సర్వే ప్రకారం పనిలో ఏఐ ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవడంలో ప్రపంచంలోనే అత్యధికంగా 53 పాయింట్లతో భారత్‌ మొదటి స్థానంలో ఉంది (ప్రపంచ సగటు కేవలం 34 పాయింట్లు మాత్రమే)
దాదాపు 75% మంది భారతీయ ఉద్యోగులు 72% మంది యజమానులు జనరేటివ్‌ ఏఐతో కార్యాలయాల్లో నిర్ణయాలు తీసుకోవడం చాలా సులువుగా మారిందని అభిప్రాయపడ్డారు
ళీ    భారత్‌లో కూడా కొత్తగా చేరిన లేదా తక్కువ అనుభవం ఉన్న ఉద్యోగుల ఉత్పాదకత ఏఐ టూల్స్‌ వల్ల ఏకంగా 34% పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)