Breaking News

భారత్‌– బంగ్లాదేశ్‌ టీ20 మ్యాచ్‌.. హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

Published on Fri, 10/11/2024 - 19:23

హైదరాబాద్‌: ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఈ నెల 12న (శ‌నివారం) భారత్‌– బంగ్లాదేశ్‌ల మధ్య  టీ–20 క్రికెట్‌ మ్యాచ్‌ జరుగనున్న నేపథ్యంలో ఉప్పల్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు  రాచకొండ కమిషనర్‌ సుధీర్‌ బాబు ఓ ప్రకటనలో తెలిపారు.

మ్యాచ్‌ జరిగే  సమయాల్లో ఉప్పల్‌ స్టేడియంవైపు భారీ వాహనాలను అనుమతించరు. 
వరంగల్‌  నుంచి ఉప్పల్‌ వైపు వచ్చే  భారీ వాహనాలు చెంగిచర్ల ఎక్స్‌రోడ్డు,  చర్లపల్లి ఐఓసీ కేంద్రం, ఎన్‌ఎఫ్‌సీ మీదుగా తమ గమ్యాలను చేరుకోవాలి.
వరంగల్‌ వైపు నుంచి ఎల్‌బీనగర్‌ వెళ్లాల్సిన వారు ఉప్పల్‌ ఏషియన్‌ ధియేటర్‌ ఎదురుగా భగాయత్‌ రోడ్డు నుంచి నాగోల్‌ బ్రిడ్జి మీదుగా వెళ్లాలి. 

ఎల్‌బీనగర్‌ నుంచి ఉప్పల్‌ వచ్చే వాహనాలు నాగోల్‌ మెట్రోస్టేషన్, ఉప్పల్‌ భగాయత్‌ నుంచి ఏషియన్‌ ధియేటర్‌  మీదుగా  బోడుప్పల్‌  చేరుకోవాలి. 
సికింద్రాబాద్‌ నుంచి ఉప్పల్‌ వైపు వచ్చే వాహనాలు  హబ్సిగూడ చౌరస్తా నుంచి నాచారం పారిశ్రామిక వాడ ద్వార చెంగిచర్ల మీదుగా  వరంగల్‌ వైపు వెళ్లాల్సి ఉంటుంది. 

చ‌ద‌వండి: ఒక్క‌సారిగా వాతావ‌ర‌ణం.. హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం

రామంపూర్‌ నుంచి ఉప్పల్‌ వైపు వచ్చే వాహనాలు హబ్సిగూడ వీధి నంబర్‌–8 మీదుగా హబ్సిగూడ మెట్రో పిల్లర్‌ 972 వద్ద యూ టర్న్‌ తీసుకుని  ఉప్పల్‌ ఎక్స్‌ రోడ్డుకు చేరుకోవాలి. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)