మేక మాంసంలో కల్తీ.. విస్తుపోయే నిజాలు!

Published on Fri, 07/17/2026 - 09:50

హైదరాబాద్‌, నాంపల్లి: కల్తీ మేక మాంసాన్ని విక్రయించిన వ్యక్తిపై చీటింగ్‌ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. ఈ నెల 1వ తేదీన హబీబ్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని మల్లేపల్లి బడే మసీదు వద్ద మహ్మద్‌ ఉస్మాన్‌ ఖురేషి దుకాణంపై హెచ్‌– ఫాస్ట్‌ ఎస్సై నవీన్, జీహెచ్‌ఎంసీ వెటర్నరీ వైద్యాధికారి డాక్టర్‌ శ్రీకాంత్, హబీబ్‌నగర్‌ ఎస్సై అశోక్, సీసీఎస్‌ పోలీసులు దాడులు జరిపారు. దుకాణంలోని 50 కిలోల కల్తీ మాంసాన్ని స్వాదీనం చేసుకున్నారు. 

సీజ్‌ చేసిన మాంసాన్ని చెంగిచర్లలోని నేషనల్‌ మీట్‌ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌ (ఎన్‌ఎంఆర్‌ఐ) ల్యాబ్‌కు తరలించి డీఎన్‌ఏ పరీక్షలు చేయగా.. విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. మేక మాంసంలో బర్రె దూడ మాంసం కలిపినట్లుగా నిర్ధారించి సంబంధిత అధికారులకు నివేదిక అందజేశారు.

ఈ నేపథ్యంలో కల్తీ మాంసం విక్రయించిన మహ్మద్‌ ఉస్మాన్‌ ఖురేషిపై త్వరలో చార్జ్‌షీట్‌ను నమోదు చేసి రిమాండ్‌కు తరలించే అవకాశం ఉందని సమాచారం. కల్తీ కేటుగాళ్లు ఎక్కువగా బర్రె దూడలనే ఎంచుకుని మేక, గొర్రె మాంసంలో కలుపుతూ విక్రయిస్తుంటారని పోలీసులు పేర్కొన్నారు. మేక, గొర్రె మాంసంలో కల్తీ చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్‌– ఫాస్ట్‌ అధికారులు హెచ్చరించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)