Breaking News

గుండెపోటుతో తమ్ముడు.. పెద్ద కర్మరోజు అన్నకు కూడా..

Published on Thu, 08/17/2023 - 07:55

కరీంనగర్‌: తమ్ముడి మృతి ని తట్టుకోలేక అన్న గుండె ఆగింది. తమ్ముడు గుండెపోటుతో మృతిచెందగా.. పెద్దకర్మరోజు అన్న కూడా గుండెపోటుతో కుప్పకూలాడు. చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశాడు. ఈ విషాద ఘటన తిమ్మాపూర్‌ మండలం రేణికుంటలో జరిగింది. రేణికుంటకు చెందిన ఉమ్మెంతల చంద్రారెడ్డికి ఇద్దరు కొడుకులు సంతోష్‌రెడ్డి(30), మధుకర్‌రెడ్డి(26) ఉన్నారు.

పెద్దకొడుకు సంతోష్‌రెడ్డి కరీంనగర్‌లో, మధుకర్‌రెడ్డి హైదరాబాద్‌లో ప్రయివేటు ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరికీ పెళ్లికాలేదు. 20 రోజుల క్రితం మధుకర్‌రెడ్డికి జ్వరం వచ్చింది. హైదరాబాద్‌లోనే ఓ ఆస్పత్రిలో చేరగా రక్తకణాలు తగ్గినట్లు డాక్టర్లు చెప్పారు. చికిత్స తీసుకుంటున్న క్రమంలో గుండెపోటుకు గురై ఈనెల 3న మృతిచెందాడు. తమ్ముడి పెద్ద కర్మరోజు సంతోష్‌ రెడ్డి గుండెపోటుకు గురయ్యాడు. ఆయనను కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు.

అక్కడి నుంచి హైదరాబాద్‌ తీసుకెళ్లారు. చికిత్సకు సుమారు రూ.20 లక్షలకు పైగా  ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో నిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం సంతోష్‌ మృతిచెందాడు. పక్షం రోజుల వ్యవధిలో ఇద్దరు కొడుకులు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)