Breaking News

కొత్త సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

Published on Sun, 04/30/2023 - 08:26

Updates..

  • సచివాలయాన్ని ప్రారంభించడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. అందరికీ నూతన సచివాలయ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ పరిపాలన కేంద్రం అత్యద్భుతంగా రూపుదిద్దుకుందని అన్నారు. సచివాలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరి కృషి ఉందన్నారు.

  • తెలంగాణ కొత్త సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌.. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్‌ చేస్తూ  తొలి సంతకం చేశారు. మొత్తం 6 ఫైళ్లపై సంతకాలు చేశారు.
  • తమ చాంబర్లలో కొలువుదీరిన  మంత్రులు
  • హైదరాబాద్‌లో లక్ష బెడ్‌ రూమ్‌ ఇళ్ల పంపిణీ ఫైల్‌పై మంత్రి కేటీఆర్‌ తొలి సంతకం
  • 6వ అంతస్తులోని తన చాంబర్‌లో కొలువుదీరిన సీఎం కేసీఆర్‌
  • పోడు భూములు పంపిణీ ఫైల్‌పై తొలి సంతకం చేసిన సీఎం కేసీఆర్‌
  •  తన కార్యాలయంలో 6 ఫైల్స్‌పై సంతకం చేసిన సీఎం కేసీఆర్‌
  • కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు.  దీనిలో భాగంగా యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. 

  • కొత్త సచివాలయంలో ప్రారంభోత్సవంలో భాగంగా మధ్యాహ్నం గం. 1.15 నిమిషాల ప్రాంతంలో సీఎం కేసీఆర్‌ అక్కడకు చేరుకున్నారు.

-‍ కొత్త సచివాలయం చేరుకున్న మంత్రి కేటీఆర్‌.

- మూడో అంతస్తును కేటీఆర్‌ పరిశీలించారు. 

- ట్యాంక్‌ బండ్‌ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు రాత్రి 8 గంటల వరకు కొనసాగనున్నాయి. 

- హుస్సేన్‌సాగర్‌, నెక్లెస్‌ రోడ్డు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు. 

- తెలుగు తల్లి జంక్షన్‌లో వాహనాల దారి మళ్లింపు. 

- ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌పై వాహనాలకు నో ఎంట్రీ. ట్యాంక్‌బండ్‌, తెలుగుతల్లి, బీఆర్‌కే భవన్‌ నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌లో వాహనాలకు అనుమతి నిరాకరణ. 

- ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న పార్కులు మూసివేత.


సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం వద్ద సందడి నెలకొంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టిన కొత్త సెక్రటేరియట్‌ను ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. తర్వాత సీఎంతోపాటు మంత్రులు తమకు కేటాయించిన చాంబర్లలో ఆసీనులై.. కొత్త సెక్రటేరియట్‌ నుంచి తొలి సంతకాలు చేయనున్నారు. ఆ తర్వాత అతిథులను, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్‌ ప్రసంగించనున్నారు. 

- గృహలక్ష్మీ సహా కీలక ఫైళ్లపై సంతకాలు చేయనున్న సీఎం కేసీఆర్‌, మంత్రులు.

- హైదరాబాద్‌లో లక్ష బెడ్‌ రూం ఇళ్ల పంపిణీపై కేటీఆర్‌ తొలి సంతకం. 

- మధ్యాహ్నం 2:15 గంటలకు సీఎం కేసీఆర్‌ ప్రసంగం. 

కొత్త సచివాలయం విస్తీర్ణం వివరాలివీ.. 
మొత్తం భూ విస్తీర్ణం: 28 ఎకరాలు 
భవనం నిర్మించిన ప్రాంతం: 2.45 ఎకరాలు 
ల్యాండ్‌ స్కేపింగ్‌: 7.72 ఎకరాలు 
సెంట్రల్‌ కోర్ట్‌ యార్డ్‌ లాన్‌: 2.2 ఎకరాలు 
పార్కింగ్‌ సామర్థ్యం: 560 కార్లు, 700 బైకులు 
ప్రధాన భవన కాంప్లెక్స్‌ బిల్టప్‌ ఏరియా: 8,58,530 చదరపు అడుగులు 
లోయర్‌ గ్రౌండ్, గ్రౌండ్, ఆరు అంతస్తుల్లో ఒక్కోదాని ఎత్తు: 14 అడుగులు 
మొత్తం ఎత్తు: 265 అడుగులు 

నిర్మాణానికి ఉపయోగించిన సామగ్రి 
ఉక్కు: 8,000 టన్నులు 
సిమెంటు: 40,,000 టన్నులు 
ఇసుక: 30,000 టన్నులు (5 వేల లారీలు) 
కాంక్రీట్‌: 60,000 క్యూబిక్‌ మీటర్లు 
ఇటుకలు: 11 లక్షలు 
ఆగ్రా రెడ్‌ స్టోన్‌: 3,500 క్యూబిక్‌ మీటర్లు 
గ్రానైట్‌: మూడు లక్షల చదరపు అడుగులు 
మార్బుల్‌: లక్ష చదరపు అడుగులు 
ధోల్‌పూర్‌ రెడ్‌స్టోన్‌: 3,500 క్యూబిక్‌ మీటర్లు 
కలప: 7,500 క్యూబిక్‌ అడుగులు 
పనిచేసిన కారి్మకులు: మూడు షిప్టుల్లో 12,000 మంది.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)