Breaking News

కుటుంబం యూనిట్‌గా రుణమాఫీ!

Published on Mon, 07/15/2024 - 05:37

సాక్షి, హైదరాబాద్‌: కుటుంబం యూనిట్‌గా పంటల రుణమాఫీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఒక కుటుంబంలోని వారి పేరిట బ్యాంకుల్లో పంట రుణాలు ఎంత ఉన్నా.. గరిష్టంగా రూ.2 లక్షల వరకు మాత్రమే మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు కసరత్తు పూర్తయిందని.. నేడో, రేపో మార్గదర్శకాలు విడుదల కావొచ్చని తెలిపాయి. ఒక కుటుంబాన్ని ఎలా లెక్కలోకి తీసుకోవాలన్న దానిపై అధికారులు ప్రాథమికంగా నిర్ణయానికి వచి్చనట్టు తెలిసింది. రేషన్‌కార్డుగానీ, గ్రామ పంచాయతీ రికార్డుగానీ, వ్యవసాయశాఖ వద్ద ఇప్పటికే ఉన్న డేటాను ఆధారం చేసుకొనిగానీ కుటుంబాలను అంచనా వేయాలని భావిస్తున్నట్టు సమాచారం. 

అనంతరం ఒక రైతు కుటుంబానికి ఎన్ని బ్యాంకు ఖాతాలు, వాటిలో ఎన్ని పంట రుణాలు ఉన్నప్పటికీ.. మొత్తం రూ.2 లక్షల వరకే మాఫీ చేయనున్నారు. రుణాలు ఉన్న కుటుంబ సభ్యుల మధ్య దామాషా ప్రకారం ఈ మాఫీ సొమ్మును విభజిస్తారు. ఒక కుటుంబం అంటే.. భర్త, భార్య, వారిపై ఆధారపడి ఉన్న పిల్లలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ మార్గదర్శకాలు విడుదలైన వెంటనే గ్రామాల వారీగా రైతుల జాబితా తయారు చేస్తారు. బ్యాంకుల అధికారులతో కలసి రుణాలున్న వారి జాబితా తయారు చేస్తారు. చివరగా గ్రామసభలో చర్చించి తుది జాబితాను సిద్ధం చేయనున్నారు. 

పీఎం కిసాన్‌ నిబంధనల అమలు యోచన! 
వచ్చే నెల 15వ తేదీ నాటికి పంట రుణాలను మాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం రూ.31 వేల కోట్లు అవసరమని అంచనా వేశారు. 2018 డిసెంబర్‌ 12వ తేదీ నుంచి 2023 డిసెంబర్‌ 9 వరకు ఐదేళ్లలో రాష్ట్ర రైతులు తీసుకున్న రూ.2 లక్షల మేరకు పంట రు­ణా­లను మాఫీ చేయనున్నారు. దాదాపు 47 లక్షల మంది రైతులకు దీనితో లబ్ధి జరుగుతుందని అంచనా. అయితే రుణమాఫీ కోసం పీఎం కిసాన్‌ పథకంలోని మార్గదర్శకాలను అమలు చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. 

పీఎం కిసాన్‌ పథకంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధిక ఆదాయం ఉండి ఐటీ పన్ను చెల్లించేవారిని మినహాయించారు. అదే తరహాలో ఇప్పుడు రుణమాఫీని మినహాయించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఆదాయ పన్ను చెల్లించే అందరినీ కాకుండా అధిక ఆదాయం ఉన్నవారిని మాత్రమే మినహాయించే ఆలోచన ఉన్నట్టు సమాచారం. 

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో అందరినీ మినహాయించకుండా.. అటెండర్లు వంటి చిన్నస్థాయి ఉద్యోగులకు రైతు రుణమాఫీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అయితే ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని.. మిగిలే మొత్తం ఎక్కువగా ఉంటేనే పీఎం కిసాన్‌ నిబంధనలు అమలు చేయాలని, లేకుంటే ఉదారంగానే రుణమాఫీ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఏదేమైనా పంటలు పండించే ప్రతి రైతుకు ప్రయోజనం కలిగించేలా పథకం అమలు జరుగుతుందని అధికారులు అంటున్నారు. 

బంగారం పెట్టి తీసుకున్న రుణాలు కూడా..! 
బంగారం తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్న రైతులకు కూడా రుణమాఫీ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. గ్రామీణ బ్యాంకుల్లో పట్టాదారు పాస్‌బుక్‌ను జతచేసి, పంటల కోసం తీసుకున్న బంగారం రుణాలకు మాత్రమే రుణమాఫీ చేయాలని భావిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో తీసుకున్న బంగారు రుణాలను మాఫీ నుంచి మినహాయించాలనే యోచన ఉన్నట్టు సమాచారం. 

గతంలోనూ ఇదే తరహా నిబంధనలు అమలు చేశారు. షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌లు, కో–ఆపరేటివ్‌ క్రెడిట్‌ సంస్థలు (అర్బన్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంకులు సహా), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రైతులకు పంపిణీ చేసిన రుణాలు, బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)