Breaking News

ఎండలు చురచుర వానలు అరకొర

Published on Thu, 07/02/2026 - 05:51

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాల సీజన్‌ పావు వంతు ముగిసింది. నాలుగు నెలల పాటు కొనసాగే నైరుతి సీజన్‌లో రెండో నెలగా భావించే జూలై వాతావరణ అంచనాలను ఐఎండీ విడుదల చేసింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సాధారణం, అంతకంటే తక్కువ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కానీ ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే అధికంగా నమోదయ్యే అవకాశాలున్నట్లు తెలిపింది. సీజన్‌ సాధారణ వాతావరణం కంటే భిన్నంగా ఉంటుందని హెచ్చరించింది. సాధారణంగా జూలైలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. కానీ పసిఫిక్‌ మహాసముద్రంలో ఎల్‌నినో పరిస్థితులు బలపడుతుండటంతో ఆ ప్రభావం వర్షాలపై తీవ్రంగా ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్‌లో కీలకమైన హిందూ మహా సముద్రంలో వాతావరణ పరిస్థితులు తటస్థంగా ఉండటం వర్షాభావ పరిస్థితులకు సంకేతంగా చెప్పొచ్చు. 

ఐఎండీ పరిశీలన ప్రకారం.. 
రాష్ట్రాన్ని నాలుగు ప్రాంతాలుగా విభజించి వాతావరణ అంచనాలను విడుదల చేసింది. వర్షాల అంచనాలతో పాటు ఉష్ణోగ్రతల స్థితిని కూడా అంచనా వేసింది. 
⇒ ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌ జిల్లాల్లో సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది  
⇒ మధ్య తెలంగాణ ప్రాంతంలోని రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్‌ జిల్లాల్లో సీజన్‌లో సగటు సాధారణ వర్షపాతానికి దగ్గరగా గణాంకాలు నమోదు కావొచ్చు 
⇒ దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని మహబూబ్‌నగర్‌ జిల్లాతో పాటు సమీప ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావొచ్చు 
⇒ తూర్పు తెలంగాణ జిల్లాలైన ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో సాధారణ సగటు వర్షపాతం నమోదు కావొచ్చు 

అంతటా అధిక ఉష్ణోగ్రతలే.. 
నైరుతి సీజన్‌లో వర్షాలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. సీజన్‌ ముగిసే నాటికి చలి తీవ్రత మొదలవుతుంది. కానీ ఈసారి నైరుతి సీజన్‌లో ఇంకా ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వానలు ఆశించినంతగా లేకపోవడం, వాతావరణంలో మార్పులతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. జూన్‌లో అధిక ఉష్ణోగ్రతలు నమోదైనా జూలై నాటికి భారీగా తగ్గుముఖం పడతాయి. కానీ ఈసారి జూలైలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. చాలా ప్రాంతాల్లో 35 డిగ్రీల్లోపు నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు అంతకంటే ఎక్కువగా నమోదవుతాయని తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలే కాకుండా రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉండనున్నాయి.    

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)