Breaking News

ఐబొమ్మ ఇమ్మడి రవి రిమాండ్‌ రిపోర్టు.. వెలుగులోకి సంచలన విషయాలు

Published on Tue, 11/18/2025 - 21:25

సాక్షి,హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమకు భారీ నష్టం కలిగించిన పైరసీ వెబ్‌సైట్‌ ‘ఐబొమ్మ’ (iBomma) ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఈ క్రమంలో ఇమ్మడి రవి పోలీసుల రిమాండ్‌ రిపోర్టులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

ఇమ్మడి రవి విడాకుల నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన సమయంలో అతని భార్య పోలీసులకు సమాచారం ఇచ్చిందన్న వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అయితే, రిమాండ్‌ రిపోర్టులో మాత్రం ఈ విషయం ఖండించింది.  రవిని పట్టించడంలో అతని భార్య పాత్ర లేదని, అతను వినియోగించిన రెండు డొమైన్ల ఆధారంగా పోలీసులు అతన్ని గుర్తించినట్లు తేలింది.  

టెక్నికల్‌ ఆధారాలు, డొమైన్ల వివరాలు
రవి ‘ఐబొమ్మ’తో పాటు ‘బప్పం టీవీ’ పేరుతో 17 ప్రధాన వెబ్‌సైట్లు, అలాగే 65కు పైగా మిర్రర్‌ వెబ్‌సైట్లు నిర్వహించినట్లు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ వెబ్‌సైట్లకు నెలకు సుమారు 3.7 మిలియన్ల యూజర్లు లాగిన్‌ అవుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ భారీ ట్రాఫిక్‌ను ఉపయోగించి, రవి బెట్టింగ్‌ సైట్లకు లింక్‌ చేసిన రెండు ట్రాఫిక్‌ డొమైన్లు ఏర్పాటు చేశాడు. వాటిలో ఒకటి అమెరికా నుంచి, మరొకటి అమీర్‌పేట నుంచి రిజిస్టర్‌ చేయించారని రిపోర్టులో ఉంది. ఈ రెండు డొమైన్లే రవిని పట్టించాయి.

నేరాన్ని అంగీకరించిన రవి
రిమాండ్‌ రిపోర్టులో రవి తానే సినిమాలను పైరసీ చేసినట్లు అంగీకరించాడని, ఏ విధంగా సైట్లు నడిపాడో వివరంగా పేర్కొన్నారు. పబ్లిక్‌ డొమైన్‌ రిజిస్ట్రీల ఆధారంగా సైబర్‌క్రైమ్‌ పోలీసులు టెక్నికల్‌ ఎవిడెన్స్‌ సేకరించారు. అంతేకాకుండా, రవి బెదిరింపులకు పాల్పడ్డ స్టేట్మెంట్లు, విదేశీ పౌరసత్వం తీసుకున్న వివరాలు కూడా రిపోర్టులో ఉన్నాయి.

పోలీసుల హెచ్చరిక
‘దేశ డిజిటల్‌ భద్రతకు ఇమ్మడి రవి లాంటి వ్యక్తులు హానికరం’ అని పోలీసులు వ్యాఖ్యానించారు. అతన్ని అరెస్ట్‌ చేయకపోతే, ఇలాంటి వెబ్‌సైట్లు మళ్లీ మళ్లీ సృష్టించే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)