Breaking News

భూదాన్ భూముల భాగోతం..ఐఏఎస్‌పై ఈడీ ప్రశ్నల వర్షం

Published on Fri, 10/25/2024 - 14:29

సాక్షి,హైదరాబాద్‌: భూదాన్ భూముల భాగోతంపై ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్‌పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. భూదాన్‌ భూముల వ్యవహారంలో ఐఏఎస్‌ అధికారి అమోయ్‌ కుమార్‌ ఈడీ అధికారుల విచారణ కొనసాగుతుంది. విచారణలో భాగంగా ఐఏఎస్‌ అమోయ్‌ కుమార్‌ శుక్రవారం ఉదయం ఈడీ కార్యాలయానికి వచ్చారు. 

అనంతరం, ఆయనను ఈడీ అధికారులు బయటకు తీసుకెళ్లారు. తిరిగి ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. అయితే ఈడీ కార్యాలయం నుంచి ఐఏఎస్‌ అధికారిని బయటకు తీసుకెళ్లిన ఈడీ అధికారులు సర్వే నెంబర్ 181,182 మహేశ్వరం మండలం నాగారంలోని భూములపై విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. సుమారు 70ఎకరాల భూదాన్ భూముల అన్యాక్రాంతంపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం.  

భూముల అక్రమ బదిలీ ఆరోపణలు 
మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్‌ భూముల బదిలీపై ఈడీ విచారణ చేపట్టింది. ఇక్కడ రూ.వందల కోట్ల విలువైన 42 ఎకరాలను ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్‌ అక్రమంగా బదిలీ చేశారని ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌గా అమోయ్ కుమార్ పనిచేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆయన పాత్రపై నిజానిజాలను తేల్చేందుకు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా ఇవాళ మూడో రోజు ఐఏఎస్‌ అమోయ్‌ కుమార్‌ ఈడీ ఎదుట హాజరయ్యారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)