Breaking News

అందుకే కూల్చేశాం.. ఎన్ కన్వెన్షన్‌పై హైడ్రా రియాక్షన్‌

Published on Sat, 08/24/2024 - 16:59

సాక్షి, హైదరాబాద్‌: ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా స్పందించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. తమ్మిడికుంట చెరువు, ఎఫ్‌టిఎల్‌, బంఫర్‌ జోన్‌లో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాం. ఈ రోజు కూల్చిన నిర్మాణాల్లో ఎన్‌ కన్వెన్షన్‌ ఒకటి. నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు జరిపారు’’ అని హైడ్రా స్పష్టం చేసింది.

తుమ్మిడికుంట, ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌పై 2014లోనే హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2016లో హెచ్‌ఎండీఏ ఫైనల్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2014లో హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌ జారీ చేశాక ఎన్‌ కన్వెన్షన్‌ హైకోర్టును ఆశ్రయించింది. నిబంధనలు ప్రకారం ఎఫ్‌టీఎల్‌ పరిధిని నిర్థారించమని హైకోర్టు సూచించింది. ఎన్‌ కన్వెన్షన్‌ ప్రతినిధుల సమక్షంలోనే ఎఫ్‌టీఎల్‌ సర్వే చేసి నివేదిక అందించాం. మేమిచ్చిన  నివేదికపై ఎన్‌ కన్వెన్షన్‌ ప్రతినిధులు మియాపూర్‌ అదనపు జిల్లా జడ్జి కోర్టును ఆశ్రయించారు.’’ అని హైడ్రా పేర్కొంది.

‘‘ప్రస్తుతం ఈ కేసు పెండింగ్‌లో ఉంది. ఎలాంటి స్టే ఇవ్వలేదు. వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ.. ఎన్‌ కన్వెన్షన్‌ వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఒక ఎకరం 12 గుంటలు, బఫర్‌ జోన్‌లో 2 ఎకరాల 18 గుంటలను ఎన్‌ కన్వెన్షన్‌ ఆక్రమించి నిర్మాణాలు చేపట్టింది. గత ప్రభుత్వంలో ఆక్రమణలను రెగ్యులర్‌ చేయించుకునేందుకు ఎన్‌ కన్వెన్షన్‌ ప్రయత్నించింది.. కానీ అధికారులు తిరస్కరించారు. తమ్మిడికుంట చెరువు ఆక్రమణల వల్ల హైటెక్స్‌ పరిధిలోని నాలాలు మూసుకుపోయి వరద వస్తుంది. ఆక్రమణల వల్ల తమ్మిడికుంట చెరువు 50 నుంచి 60 శాతం వరకు కూచించుకుపోయింది.’’ అని హైడ్రా వెల్లడించింది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)