Breaking News

హైడ్రా రంగనాథ్‌ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలపై కేసు

Published on Wed, 08/05/2026 - 11:26

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో నకిలీ పత్రాల వ్యవహారం కలకలం రేపుతోంది. హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్‌ ఎన్‌వోసీలు (NOCలు) సృష్టించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది ప్రైవేట్‌ కాలేజీలపై కేసు నమోదైంది. దీంతో, ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అయితే, ఈ నకిలీ ఎన్‌వోసీలను ఇంటర్‌ బోర్డుకు సమర్పించి గుర్తింపు పొందేందుకు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. హైడ్రా పేరుతో తయారు చేసిన నకిలీ పత్రాల వ్యవహారం వెలుగులోకి రావడంతో, సంబంధిత కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై హైదరాబాద్‌లోని లేక్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నకిలీ పత్రాల తయారీ, ఫోర్జరీ, మోసం తదితర అభియోగాల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు నమోదు చేసిన కేసులో భారత న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 337, 336(3), 340(2), 318(4), 3(5) కింద చర్యలు తీసుకుంటున్నారు.

కాగా, పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెల్లాపూర్‌, చిక్కడపల్లి, ఎస్‌ఆర్‌ నగర్‌, మెహిదీపట్నం, బర్కత్‌పుర ప్రాంతాల్లో ఉన్న కొన్ని కాలేజీల యాజమాన్యాలు ఈ ఫోర్జరీ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఇదే తరహాలో మరిన్ని అక్రమాలు జరిగాయా? అన్న కోణంలో అధికారులు విచారణను ముమ్మరం చేశారు. మరో 60 కాలేజీలకు సంబంధించిన ఎన్‌వోసీలను కూడా స్క్రూటినీ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు.. హైడ్రా పేరును ఉపయోగించి, ప్రభుత్వ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేయడం తీవ్ర నేరమని అధికారులు చెబుతున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని కాలేజీలపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

హైడ్రా రంగనాథ్ సంతకం ఫోర్జరీ 8 కాలేజీలు క్లోజ్

ఎనిమిది కాలేజీలు ఇవే..

  • మెహిదిపట్నంలోని ప్రియాంకా జూనియర్ కాలేజ్
  • విద్యానగర్‌లోని మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్
  • చాంద్రాయణ గుట్టలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్
  • చిక్కడపల్లిలోని న్యూఎరా జూనియర్ కాలేజ్
  • శివరాంపల్లిలోని షాహిర్ జూనియర్ కాలేజ్
  • తెల్లాపూర్‌లోని వశిష్ట జూనియర్ కాలేజ్
  • బర్కత్‌పురలోని హైందవి జూనియర్ కాలేజ్
  • ఎస్‌ఆర్‌ నగర్‌లోని రెసిడెన్స్ జూనియర్ కాలేజ్

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)