Breaking News

ఇంకా దొరకని బాలయ్య ఆచూకీ!

Published on Wed, 07/29/2026 - 07:30

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని మియాపూర్‌ వైశాలి నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. మ్యాన్‌హోల్‌లో ప్రమాదవశాత్తు పడి బాలయ్య అనే వ్యక్తి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే హైడ్రా (HYDRAA), ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే గంటల తరబడి గాలించినా.. ఇంకా బాలయ్య ఆచూకీ చిక్కలేదని తెలుస్తోంది.

స్థానికుల సమాచారం ప్రకారం.. వైశాలి నగర్‌ ప్రాంతంలో బాలయ్య మంగళవారం అండర్‌పాస్‌ వద్ద తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో ప్రమాదవశాత్తు పడిపోయాడు. కూతురి ఇంటికి వెళ్లే క్రమంలో ఈ ఘటన జరిగింది. గమనించిన కొందరు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దీంతో సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. 

హైడ్రా, ఎన్డీఆర్‌ఎఫ్‌ రంగప్రవేశం
బాలయ్య ఆచూకీ కోసం హైడ్రా, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. మ్యాన్‌హోల్‌ పరిసరాల్లో, డ్రైనేజీ మార్గాల్లో గాలింపు కొనసాగిస్తున్నారు. లోపల పరిస్థితులను పరిశీలిస్తూ సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

స్థానికుల్లో ఆందోళన
ఈ ఘటనతో వైశాలి నగర్‌లో ఆందోళన నెలకొంది. వర్షాకాలంలో నాల పనులు చేపట్టడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు బాలయ్య కుటుంబ సభ్యులు  ఆ పెద్దాయన కోసం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహాయక బృందాలు అతడి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. బాలయ్య ఆచూకీ లభించే వరకు గాలింపు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)