Breaking News

ఇకపై ప్రతి సోమవారం.. హైడ్రా కీలక నిర్ణయం

Published on Sat, 01/04/2025 - 20:12

సాక్షి, హైదరాబాద్‌: ప్రతి సోమవారం బుద్ధ భవన్ వేదికగా నగర ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించాలని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పార్కులు, స్థలాలు, చెరువులకు సంబంధించి ఆక్రమణలపై నేరుగా ప్రజల నుండి ఫిర్యాదుల స్వీకరించనున్నారు. ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు ప్రజావాణి నిర్వహించనున్నారు. ప్రజావాణిలో ఫిర్యాదుదారులు ఆధారాలతో సహా రావాలని హైడ్రా కమిషనర్‌ సూచించారు. మొదటగా వచ్చిన 50 మంది ఫిర్యాదు దారులకు టోకెన్స్ ఇచ్చి.. ప్రాధాన్యతా క్రమంలో ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపిన రంగనాథ్‌ వెల్లడించారు.

ఐఎస్‌బీ మేగజైన్‌లో ‘హైడ్రా’
రాజధానిలోని జలవనరుల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) రికార్డుల్లోకి ఎక్కింది. ఈ సంస్థకు చెందిన ‘ఐఎస్‌బీ ఎగ్జిక్యూటివ్‌ ఎడిషన్‌’ డిసెంబర్‌–2024 మేగజైన్‌లో హైడ్రాపై వ్యాసం ప్రచురితమైంది. పబ్లిక్‌ పాలసీ విభాగంలో ‘హైదరాబాద్స్‌ హైడ్రా: ఎన్‌ ఎక్సర్‌సైజ్‌ ఇన్‌ అర్బన్‌ వాటర్‌ బాడీ రిక్సామ్‌నేషన్‌’ శీర్షికన దీన్ని ప్రచురించింది. తన అధికారిక వెబ్‌సైట్‌లోనూ ఈ వ్యాసాన్ని అందుబాటులో ఉంచింది.

దాదాపు ఏడు వేల జలవనరులతో సిటీ ఆఫ్‌ లేక్స్‌గా పేరున్న హైదరాబాద్‌లో ప్రస్తుత పరిస్థితి, దానికి కారణాలను ఈ వ్యాసం వివరించింది. గతేడాది జూలై 19న హైడ్రా ఏర్పడిన తర్వాతి పరిస్థితులు, చెరువుల పునరుద్ధరణకు తీసుకుంటున్న చర్యలను అభినందించిన ఈ వ్యాసం, హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ జలవనరుల పరిరక్షణకు కృషి చేస్తున్నారని కితాబిచ్చింది. జనావాసాల జోలికి వెళ్లకుండా చెరువుల పరిరక్షణ చేపట్టాలంటూ హైడ్రా తీసుకున్న పాలసీ నిర్ణయాన్ని ఐఎస్‌బీ వ్యాసం అభినందించింది.

ఇదీ చదవండి: హెచ్‌ఎంపీవీ వైరస్‌పై తెలంగాణ సర్కార్‌ అలర్ట్‌

జల వనరుల ఆక్రమణ, అవి కనుమరుగు కావడం, కాలుష్య కోరల్లో చిక్కుకోవడం తదితర సమస్యలు దేశ వ్యాప్తంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు హైడ్రా తరహా వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకోవాలని ఐఎస్‌బీ తన వ్యాసంలో సూచించింది. తెలంగాణకు చెందిన పాలకులు, అధికారులు హైడ్రాకు మరింత చేయూత ఇవ్వాలని అభిప్రాయపడింది.

 


 

 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)