Breaking News

శామీర్‌పేటలో హైడ్రా కూల్చివేతలు

Published on Thu, 01/22/2026 - 09:32

మేడ్చల్‌: జిల్లాలోని శామీర్‌పేటలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. 30 ఏళ్ల క్రితం 20 ఫీట్ల రోడ్డు కబ్జా చేసి ప్రహరీ గోడ నిర్మించారు.  అయితే దీనిపై ఫ్రెండ్స్‌ కాలనీ వాసులు ఫిర్యాదు చేయడం‍తో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ప్రహరీ గోడ కూల్చివేసి రోడ్డు డైరెక్షన్‌ ఇవ్వడంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

ఇటీవల మియాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్‌ చేపట్టింది. రూ. 3 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. 15 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా.. మియాపూర్‌ విలేజ్‌ ముక్తా మహబూబ్‌పేటలో ఆక్రమణలను తొలగించింది.   ప్రభుత్వ ఆక్రమిత భూములపై హైడ్రా చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.  ప్రభుత్వ ఆక్రమిత భూమి చిన్నదా.. పెద్దదా అని కాకండా హైడ్రా కూల్చివేతలు చేపడతూ వస్తంది. గత కొంతకాలంగా తెలంగాణలోని హైదరాబాద్‌ నగర పరిధిలోని అనేక ఆక్రమిత భూములన హైడ్రా కాపాడింది. 

కాగా, గత ఏడాది నవంబర్‌లో నగరంలోని గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ సమీపంలో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు తొలగించింది. ఇక్కడి ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ లేఅవుట్‌లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారంటూ హైడ్రాకు ఫిర్యాదు అందడంతో అధికారులు పరిశీలించారు. అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఔట్ లో అక్రమ కట్టడాలను నేలమట్టం చేసింది. అనుమతులు లేని షేడ్స్ కట్టడాలను హైడ్రా సిబ్బంది తొలగించారు.

Videos

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)