15 ఏళ్లుగా నరకం అనుభవిస్తున్నాం.. మా గోడు వినండి..

Published on Tue, 07/14/2026 - 12:31

సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఓ మహిళా పిటిషనర్‌ కన్నీరుమున్నీరుగా విలపించారు. 15 ఏళ్లుగా తమ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురవుతోందని, ఒక్కసారి తమ గోడు వినాలని హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ... ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ను వేడుకున్నారు. అవసరమైతే ఆన్‌లైన్‌లో విచారణకు హాజరుకావాలని, అనవసరంగా ప్రయాణ ఖర్చులు భరించవద్దని సీజేఐ సూచించారు. 

తన కేసుకు సంబంధించి స్వయంగా వాదనలు వినిపించేందుకు హైదరాబా ద్‌ నుంచి వచ్చిన సదరు మహిళ సోమవారం ఉదయం మెన్షన్‌ సమయంలో మాట్లాడుతూ... ‘పదిహేనేళ్లుగా మేం జీవచ్ఛవాల్లా బతుకుతున్నాం. మా కుటుంబాలు పూర్తిగా నాశనమయ్యాయి. పిల్లలకు కనీసం తిండిపెట్టలేని, చదువు చెప్పించలేని దీనస్థితిలో ఉన్నాం. నా బాధ మీ మనసుకు చేరాలనే ఇక్కడికి వచ్చాను. ఒక మహిళకు మంగళసూత్రం కంటే మరేదీ ఎక్కువ కాదు.. ఇప్పుడు నా మెడలో ఏముందో చూడండి’ అంటూ తన మంగళసూత్రం తీస్తూ భావోద్వేగానికి గురయ్యారు.  

ఆన్‌లైన్‌లో హాజరుకండి: సహారా ఆస్తుల విక్రయ వ్యవహారాలకు సంబంధించిన ఈ కేసులో మహిళ ఆవేదనకు స్పందించిన జస్టిస్‌ సూర్యకాంత్‌ ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ‘మీరు సుప్రీంకోర్టుకు రావడానికి ప్రయాణ ఖర్చులు వృథా చేసుకోవద్దు. ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో హాజరుకండి. 

మీ వాదనలు ఎంతసేపైనా వింటాం. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతే నిర్ణయం ఉంటుంది’ అని సీజేఐ చెప్పారు. సీజేఐ సూచనను మహిళ సున్నితంగా తిరస్కరించారు. తన జీవితం కంటే ఏదీ ముఖ్యం కాదని, తదుపరి విచారణకు కూడా తాను స్వయంగా వస్తానని పట్టుబట్టారు. దీంతో వచ్చే వారం ఈ కేసు కోసం ఒక ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీజేఐ ప్రకటించారు. ఆ రోజు బోర్డు జాబితాలో ఈ కేసును మొదటి వరసలో ఉంచుతామని, ప్రత్యేక ధర్మాసనమే కేసును విచారిస్తుందని చెప్పారు. 

Videos

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)